లక్షా 57 వేల కోట్లతో ఏపీ బడ్జెట్.. ప్రపంచస్థాయి రాజధానే లక్ష్యం.. AP finance minister Yanamala Presents Budget In Assembly

Andhra pradesh finance minister yanamala ramakrishnudu presents budget in assembly

yanamala ramakrishnudu, Andhra Pradesh budjet-2017, andhra pradesh budget 17-18, ap budget 2017-18, ap financial year budget, chandrababu, ys jagan, ap government, Tdp, ysrcp, budget

Andhra Pradesh finance minister Yanamala Ramakrishnudu Presents Budget In Assembly with 1.57 lakh crore says world class capital construction is governments dream along with welfare of development of all classes.

ITEMVIDEOS: లక్షా 57 వేల కోట్లతో ఏపీ బడ్జెట్.. ప్రపంచస్థాయి రాజధానే లక్ష్యం..

Posted: 03/15/2017 11:44 AM IST
Andhra pradesh finance minister yanamala ramakrishnudu presents budget in assembly

రాజధాని లేని రాష్ట్రంగా అవిర్భవించి.. ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ రాజధాని నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో నిర్మించిన శాసనసభలో తొలిసారిగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. లక్షా 56వేల 999 కోట్ల రూపాయలతో 2017-18 రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. లక్ష 25 వేల 911 కోట్ల రూపాయల రెవెన్యూ వ్యయంగా, 31వేల 87 కోట్ల రూపాయలను పెట్టుబడి వ్యయంగా బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు.

ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన యనమల దేశంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా నిలుపుతున్నామన్నారు. అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన యనమల రాజధాని నిర్మాణం దేశానికే ఆదర్శంగా ఉంటుందన్నారు. అభివృద్ధిని వేగవంతం చేసేందుకే రాజధానిని అమరావతికి తరలించామని తెలిపారు. 9 రంగాల ఆధారంగా రాజధాని నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. ప్రాచీన సంస్కృతిలో వేళ్లూనుకొని ప్రపంచ స్థాయి అకాంక్షలకు రాజధాని అద్దం పట్టేలా రాజధాని నిర్మాణం చేపడుతున్నామన్నారు.


బడ్జెట్‌ హైలైట్స్‌
► మొత్తం బడ్జెట్‌ రూ. 1,56,999 కోట్లు
► రెవిన్యూ వ్యయం రూ. 1,25,911 కోట్లు
► పెట్టుబడి వ్యయం రూ. 31,087 కోట్లు

► వ్యవసాయ రంగానికి రూ. 9,090 కోట్లు
► గ్రామీణాభివృద్ధికి రూ. 19,565 కోట్లు
► సాగునీటి రంగానికి రూ. 12,770 కోట్లు
► విద్యుత్ రంగానికి రూ. 4274 కోట్లు

► పరిశ్రమలు, గనులకు రూ. 2,085 కోట్లు
► రవాణా శాఖకు రూ. 3,946 కోట్లు
► జనరల్‌ ఇకో సర్వీసెస్‌కు రూ 4,813 కోట్లు

►విద్యారంగానికి రూ. 20,384 కోట్లు
►క్రీడలు, యువజన శాఖకు రూ. 1,005 కో్ట్లు
► సాంకేతిక విద్యకు రూ. 765 కోట్లు
► ఆరోగ్యశాఖకు రూ. 7,020 కోట్లు

► నీటిపారుదల, పారిశుద్ధ్య రంగానికి రూ. 1575 కోట్లు
►  హౌసింగ్‌ శాఖకు రూ. 1456 కోట్లు
►  పట్టణాభివృద్ధి శాఖకు రూ. 5207 కోట్లు
►  సంక్షేమ రంగానికి రూ. 11,361 కోట్లు
►  రుణమాఫీకి రూ. 3600 కోట్లు

► హోంశాఖకు రూ. 5,221 కోట్లు
► రహదారులు, భవనాల శాఖకు రూ. 4041 కోట్లు
► నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం కోసం రూ. 500 కోట్లు.
► రాజధాని అభివృద్ధికి రూ. 1061 కోట్లు
► ఐటీ శాఖకు రూ. 364 కోట్లు

► పౌరసరఫరాల శాఖకు రూ. 2,800 కోట్లు
► పింఛన్లకు రూ. 4,376 కోట్లు
► నిరుపేదల విద్యుత్‌ సబ్సిడీకి రూ. 3,300 కోట్లు
► ఆరోగ్య శ్రీకి రూ 1000 కోట్లు
► ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ. 3,528 కోట్లు

► గ్రామీణ రహదారులకు రూ. 262 కోట్లు
► డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద రూ. 1600 కోట్లు
► అన్నా క్యాంటీన్లకు రూ. 200 కోట్లు
► మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 100 కోట్లు

► కాపు కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు
► బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 75 కోట్లు
► క్రైస్తవ కార్పొరేషన్‌కు రూ. 35 కోట్లు

► రాష్ట్ర విభజన అనంతరం భారీ రెవెన్యూ లోటు లాంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం.
► గత రెండున్నరేళ్లకాలంలో వివిధ ప్రమాణాల ప్రకారం మనం గొప్ప పురోగతి సాధించాం
► రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం

► రాష్ట్ర రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు
► 92 రోజుల్లోనే నూతన శాసనసభ భవనాన్ని నిర్మించుకోగలిగాం
► ఏడాది వ్యవధిలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేశాం

► పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టేదిశగా కదులుతున్నాం
► ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ సాధించాం
► విజన్‌ 2029 నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్‌ ప్రతిబింబిస్తుంది

► మా ప్రభుత్వం జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలు గెలుచుకుంది
► శక్తి, ఇంధన రంగాల్లో రాష్ట్రానికి ఐదు పురస్కారాలు దక్కాయి
► జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయం పెరుగుతుంది. పన్నుల ఎగవేత తగ్గుతుంది

► స్థూల జాతీయోత్పత్తిలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నాం
► కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నాం
► మన రాజధాని నగరం దేశానికే ఒక ఆదర్శ నమూనా నిలబడనుంది

► ప్రత్యేక హోదా సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయ హామీని పొందగలిగాం
► ప్యాకేజీ నిదులకు త్వరలోనే తగిన చట్టబద్ధత సాధిస్తాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles