కుటుంబ సాంప్రదాయాలు, పిల్లల పోషణ, భారం ఇలాంటి సూత్రాలు మన లాంటి దేశాలకు సరిపోతాయని కానీ, ఆధునిక భావజాలాలు అధికంగా ఉన్న పాశ్చాత్య దేశాల్లో కాదు. ఓ వయసు రాగానే సొంతగా బతకాలంటూ పిల్లలను ప్రోత్సహించటం, తప్పులు చేస్తే దండించటం లాంటివి చేస్తారు. అయితే ఆస్ట్రియాలో ఓ తండ్రి మాత్రం కాస్త ముందుకు వెళ్లాడు. తన కూతురు సుద్ద దండగ అంటూ ఆమెపై పెట్టిన ఖర్చును ఇప్పించాలంటూ కోర్టును ఆశ్రయించాడు.
యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో ఆర్కిటెక్చర్ కోర్సు చదువుతున్న ఓ యువతి పై ఆమె తండ్రి కేసు వేశాడు. ఎనిమిది సెమిస్టర్లలో పూర్తిచేయాల్సిన ఆర్కిటెక్చర్ కోర్సును 13 సెమిస్టర్లకు కూడా ఇంకా పూర్తి చేయలేదని అందులో పేర్కొన్నాడు. చదువుపై ఆమె శ్రద్ధ పెట్టడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేస్తూ, ఆమె పై పెట్టిన ఖర్చును తనకు చెల్లించేలా ఆదేశించాలని పిటిషన్ లో న్యాయస్థానాన్ని కోరాడు.
అయితే దిగువ న్యాయస్థానాలు ఆ పిటిషన్ కొట్టేసినప్పటికీ, చివరకు సుప్రీంకోర్టులో మాత్రం ఆ తండ్రి విజయం సాధించాడు. ఆమె విద్యకు చేసిన 24,000 యూరో (16 లక్షల రూపాయలు) వడ్డీతో కలిపి మరీ ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదనండీ కోర్టు ఫీజుకయిన 8,000 యూరో (5.6 లక్షల రూపాయ) లు కూడా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. అయితే ఇదేం కొత్త తీర్పు కాదని, గతంలో ఇలాంటివే ఆరు కేసులు నమోదయ్యాయని ఆస్ట్రియా మీడియా కథనాలు రాసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more