ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టప్పేనా..? అదేంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. బాహుబలి చిత్రంతో పోలికేంటి..? అనుకుంటున్నారా.? ఇప్పుడిదే అంశం తెలంగాణ సహా పోరుగునున్న తెలుగు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలకు సంచలనాలు కలిగించిన చిత్రాలను సరిపోల్చుతూ అందులో తమవారు ఫలానా పాత్రధారితో పోల్చడం ఈ మధ్యకాలంలో ఫ్యాషెన్ గా మారింది. గతంలో రామరాజ్యమని, లేక పోతే సత్యయుగమని పోల్చుకున్న నేతలు మారుతున్న కాలంతో పాటు మారుతూ సూపర్ హిట్ అయిన చిత్రాలతో వారిని వారు పోల్చుకుంటున్నారు.
ప్రత్యర్థులను కూడా చిత్రాల్లోని ప్రతినాయకుడి పాత్రలను అంటగడుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు పునాది పడింది మాత్రం సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలోనే. అది స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో వుండగానే. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా సీఎల్పీ నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్ లో పదే పదే అవే తప్పులు పునారావృతం అవుతున్నాయిని. ఎన్ని సార్లు చెప్పినా ప్రభుత్వ తీరులో మార్పు రావడం లేదని అన్నారు. అందుకనే తాను బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడనని, తమ పార్టీకి చెందిన ఇతరులకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తానన్నారు.
అంతటితో అగని జానారెడ్డి ఏకంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇక తాను బడ్జెట్ పై మాట్లాడని అన్నారు. పనిలో పనిగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసేందుకు, ప్రజలను నిజమైన సంక్షేమం వైపు తీసుకెళ్తేందుకు రాజకీయాల్లోకి బాహుబలి వస్తాడంటూ వ్యాఖ్యలు చేశారు. అంతే అవికాస్తా ఇప్పుడు ఇరు పార్టీల మధ్య రాజకున్నాయి. అ అంశాన్ని మరింతగా రాజేస్తూ మాజీ మంత్రి డీఎ అరుణ కొనసాగించారు. రాజకీయాల్లోకి బాహుబలి రావడం ఖాయమే కానీ, ఆ వచ్చేవాడు తమలోనే ఒకడై వుంటాడని చమత్కరించారు. అంతేకాదు పనిలో పనిగా తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పోడుస్తున్న సీఎం కేసీఆరే కట్టప్ప అని ఎద్దేవా చేశారు. మరి రాజకీయ బాహుబలికి ఇక్కడితో తెరపడుతుందో.. లేక మరెక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more