రామ మందిరమో లేక బాబ్రీ మసీదో.. కోర్టు బయటే తేల్చుకోండి | Settle Ayodhya Dispute Outside Court.

Supreme court advises ayodhya issue

Supreme Court, Ram Temple Dispute, Ayodhya Dispute, Supreme Court Ayodhya Dispute, Subramanian Swamy Ayodhya Issue, Ram Mandir or Babri Masjid, Supreme Court Ram Mandir, Ram Mandir Outside Court

Supreme Court Advises Settle Ram Temple Dispute Outside Court. BJP Leader subramanian Swamy had requested the court to take up the Ram Mandir appeal, which has been pending for six years before the top court.

అయోధ్య వివాదం: సుప్రీం సంచలన వ్యాఖ్యలు

Posted: 03/21/2017 11:27 AM IST
Supreme court advises ayodhya issue

అయోధ్య మందిర వివాదంపై ఇరు పక్షాలు కూర్చుని మాట్లాడుకోవాలని సుప్రీం కోర్టు సంచలన కామెంట్లు చేసింది. ఏళ్లకు ఏళ్లుగా ఈ అంశం నలుగుతూనే ఉందన్న అత్యున్నత న్యాయస్థానం, రామ మందిరం గానీ, బాబ్రీ మసీదు గానీ..  సత్వరమే దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించింది.

ఆరేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న బాబ్రీ మసీదు కేసు వివాదంపై అత్యవసరంగా విచారణ జరపాలంటూ బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ఓ పిటిషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్లు, ప్రతివాదులతో చర్చించి కోర్టు బయట వివాదాన్ని పరిష్కరించుకోవాలని తెలిపింది. ఇది మతానికి, సెంటిమెంట్ కు సంబంధించిన అంశం. నమ్మకాలకు సంబంధించి విషయాల్లో న్యాయస్థానాల కంటే బయటే పరిష్కారం చేసుకోవటం మంచిదని కోర్టు సూచించింది. అవసరమైతే తానే మధ్యవర్తిత్వం వహిస్తానని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖెహర్ వ్యాఖ్యానించటం విశేషం.

కాగా, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి రాగానే అయోధ్య రామమందిరం అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. కరడుగట్టిన హిందుత్వ వాది అయిన యోగి ఆదిత్యనాథ్ రెండేళ్లలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసి తీరతాడంటూ ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా కోర్టుల్లో నలుగుతున్న ఈ విషయంలో నేడు ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Ayodhya Dispute  Ram Mandir  Babri Masjid  

Other Articles