రైలు మిస్సయినా.. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా ఇక డోంట్ వర్రీ | Vikalp scheme for waitlisted train travellers.

Travel in premier trains at express fare

Vikalp scheme, Indian Railways Scheme, Premier Trains Express Charge, Rajdhani or Shatabdi Vikalp, Vikalp Scheme Routes, Indian Railways, Indian Train Miss, Train Miss Alternate, Alternate Scheme for Passengers, Waitlisted Train Travellers

Named 'Vikalp' or alternative, the scheme aims to utilise vacant berths in many premier trains including Rajdhani, Shatabdi, Duronto and other special ones such as Suvidha trains in all major routes.

కొత్త స్కీం: ఒక రైలు మిస్ అయితే మరొకటి

Posted: 03/22/2017 08:31 AM IST
Travel in premier trains at express fare

ఉరుకులు, పరుగులతో స్టేషన్ కి వెళ్లితే మనం ఎక్కాల్సిన రైలు వెక్కిరిస్తూ వెళ్లిపోతుంటుంది. అలాంటి సమయంలో బాధపడాల్సిన అవసరం లేదని రైల్వే శాఖ చెబుతోంది. మీ వద్ద ఉన్న టికెట్‌తోనే అదే మార్గంలో వెళ్లే ఇంకో రైలును ఎక్కేయొచ్చంట. వికల్ప్ పేరుతో కొత్త పథకాన్ని రైల్వే శాఖ ప్రకటించడమే కాదు, వచ్చే నెల నుంచే ఇది అందుబాటులోకి రానుంది.

ఏప్రిల్ 1 నుంచి వికల్ప్ పథకం అమలు కానుంది. దీని ప్రకారం టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆప్షన్ ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ లాంటి రైళ్లలో టికెట్లు బుక్ చేసుకున్నా కూడా ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. అంతేకాదు రాజధాని, శతాబ్ది లాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లలో కూడా మీరు ప్రయాణించొచ్చంట. ఎక్కాల్సిన రైలు, తర్వాత ఎక్కబోయే చార్జీలలో తేడాలున్నప్పటికీ ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయరు. అలాగే రీఫండ్ కూడా జరగదు.

ఇక మరీ ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికుల కోసం దీనిని రూపొందించారని చెప్పుకోవచ్చు. అదే మార్గంలో వెళ్లే ఇతర రైళ్లలో వారికి బెర్త్‌లు కేటాయిస్తారు. ఇంతకీ ఈ స్కీం వెనుక అసలు ఆంతర్యం ఏంటంటే... టికెట్ల రద్దు వల్ల ఏటా రూ.75000 కోట్లను రైల్వే శాఖ రీఫండ్ రూపంలో చెల్లించుకోవాల్సి వస్తుంది. దీనిని నివారించేందుకే వికల్ప్ పథకాన్ని తెరపైకి తెచ్చింది. రాజధాని, శతాబ్ది, దురంతో , సువిధ లాంటి రైళ్లలో కూడా బెర్తులు ఖాళీగా మిగిలిపోవటం, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకే జనాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటంతో ఈ ఆలోచన రూపకల్పన చేశారు. నవంబర్ 1 నుంచే ఢిల్లీ–లక్నో, ఢిల్లీ–జమ్మూ, ఢిల్లీ–ముంబై లాంటి మార్గాల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా, ఏప్రిల్ 1 నుంచి మిగతా రాష్ట్రాలకు విస్తరించనున్నారు.


బ్రేక్‌ఫాస్ట్ రూ.30.. లంచ్ రూ. 50:

రైల్లో అందిస్తున్న ఆహార పదార్థాల ధరల పట్టికను రైల్వేశాఖ విడుదల చేసింది. రైళ్లలో ఆహార పదార్థాలు, శీతలపానీయాలు తదితర వాటికి ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్పందించిన రైల్వే కేటరింగ్ సేవల ధరల కార్డును ప్రకటించింది. దీని ప్రకారం.. టిఫిన్ రూ.30, లంచ్, డిన్నర్ వెజ్ అయితే రూ. 50, నాన్ వెజ్ అయితే రూ.55, ప్యాకేజ్‌డ్ డ్రింకింగ్ వాటర్ లీటర్ రూ.15, కాఫీ, టీ రూ.7గా పేర్కొంది. ఈ ధరలకు మించి విక్రయిస్తే తమకు ఫిర్యాదు చేయాలని రైల్వే శాఖ కోరింది. 8121281212  కు సందేశం లేదా ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో పిర్యాదు చేయాలని సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikalp Scheme  Indian Railways  Premier Trains  Express Train Charges  

Other Articles