ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అవరణలో మరోమారు అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయితే అసెంబ్లీ లోపల కాకుండా అసెంబ్లీ అవరణలో ప్రజలకు తమ గోంతు వినిపించే ప్రయత్నం చేసే మీడియా పాయింట్ వద్ద ఈ ఘటన జరిగింది. నిన్న ఇరు పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధుల మధ్య ఏకంగా మైకులను లాక్కునే ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికీ మధ్య వాదప్రతివాదాలు చోటుచేసుకున్నాయి.
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు రైతుల సమస్యలపై నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడంతో.. సభలో గంధరోగోళం తలెత్తిన కారణంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు సభను పది నిమిషాలు పాటు వాయిదా వేశారు. అయితే, అదే సమయంలో అసెంబ్లీలో తమ గొంతును నొక్కుతున్నారని, దాంతో మీడియా పాయింట్ వద్దకు చేరుకుని తాము చెప్పాలనుకుంది అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసిన వైసీపీ అక్కడ కూడా గొంతు నోకేస్తున్నారని అరోపించింది.
మీడియా పాయింగ్ కు రమారమి టీడీపీ, వైసీపీ సభ్యుల ఒకేసారి వచ్చారు. అయితే కొంత ముందుగా చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాగానే అదే సమయానికి కొన్న క్షణాల అలస్యంగా మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా చేరుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మైకుల కోసం వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇరువురు నేతలు మీడియా ముందు మాట్లాడడానికి పోటీ పడ్డారు. మీడియా ముందే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
అసెంబ్లీలో అధికార పార్టీ తమకు మైకులు ఇవ్వకుండా తమ గోంతులు నొక్కితే.. ఇటు మీడియా పాయింట్ వద్ద కూడా అధికార పార్టీ నేతలు, మంత్రులు తమ వాణి ప్రజలకు వినిపించకుండా అడ్డుకుంటున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తోందని దానిపై చర్చించేందుకు, నిజానిజాలను సభ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నం విపక్ష పార్టీగా తాము చేస్తున్నామన్నారు. అధికార పార్టీ తప్పుడు విషయాలను కొండంత ప్రచారం చేసుకుంటున్నారని, అసలు వారు చేసింది ఎంత అన్న విషయం పూర్తిగా ప్రజలకు తెలుసునని అన్నారు. కాగా, తమ ప్రభుత్వం వైఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుందని మంత్రి పల్లె అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more