పార్లమెంట్ పై దాడి.. ఎంత ఘోరంగా ఉందంటే... | Terror Attack Near United Kingdom's Parliament.

What to know about the london parliament attack

Westminster Bridge, London Parliament Attack, United Kingdom's Parliament, Parliament Terror Attack, London Attack, Parliament Attack, Westminster Bridge Terror Attack, Westminster Bridge Accident

London Parliament Attack. Attacker Kills 4, Injures Dozens In 'Strike At The Heart' Of Westminster Bridge terror strikes.

ITEMVIDEOS:పార్లమెంట్ పై దాడి.. అసలేం జరిగింది?

Posted: 03/23/2017 08:30 AM IST
What to know about the london parliament attack

ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న సమయంలో బ్రిటన్‌ పార్లమెంటుపై విరుచుకుపడ్డారు. సమావేశాలు జరుగుతున్న వేళ కాస్త దూరంలోనే ఉన్న వెస్ట్‌ మినిస్టర్‌ బ్రిడ్జిపై ఓ ఉగ్రవాది కారుతో బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయలయ్యాయి. ఆపై ఓ భద్రతా సిబ్బందిని కూడా పొడిచి చంపటం పెను కలకలమే రేపింది.

అసలేం జరిగింది...]

బూడిద రంగు హ్యుందాయ్‌ ఐ40 కారులో వెస్ట్‌ మినిస్టర్‌ బ్రిడ్జి దూసుకొచ్చిన దుండగుడు పాదచారులపైకి దూసుకెళ్లాడు. దీంతో ఓ మహిళ సహా ముగ్గురు స్పాట్ లోనే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనలో మరో 20 మందికి గాయలయినట్లు సమచాారం. ఆ ముష్కరుడి హింసాకాండ అక్కడితోనే ఆగలేదు అదే వేగంతో వెస్ట్‌ మినిస్టర్‌ ప్యాలెస్‌ (పార్లమెంట్‌ భవనం) వైపు దూసుకొచ్చాడు. అయితే అతివేగంతో ఇనుప రెయిలింగ్‌ ను ఢీకొట్టడంతో కారు ఆగిపోయింది. దీంతో పార్లమెంట్‌ ప్రధాన ద్వారం గుండా భవనం లోపలికి చొరబడేందుకు యత్నించాడు.

అక్కడ ఓ భద్రతా అధికారి అడ్డుకునేందుకు యత్నిస్తే అతన్ని కత్తితో పొడిచి చంపాడు. మరో భద్రతాధికారిపై దాడికి తెగబడే ప్రయత్నంలో ఉండగా, అక్కడే ఉన్న సివిల్‌ దుస్తుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఉగ్రవాదిపై కాల్పులు జరిపి హతమార్చారు.

 

ఎమర్జెన్సీ సమావేశం..

ఘటన జరిగిన క్షణాల్లోనే.. బ్రిటన్ ప్రధాని సిబ్బంది ప్రధాని థెరిసా మేను వేరే కారులో తరలించారు. తన కార్యాలయానికి చేరుకున్న వెంటనే ఆమె అక్కడి నుంచే భద్రతను పర్యవేక్షించారు. అత్యవసర భద్రతా సమావేశం ఏర్పాటు చేశారు. లండన్ ను భద్రతా దళాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. కీలక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమయ్యారు. ప్రధానిని కార్యాలయానికి తరలించిన సిబ్బంది... పార్లమెంటు నుంచి బయటకు ఎవరినీ రావద్దని హెచ్చరించారు. ఈ సమయంలో పార్లమెంటులో పలువురు ఎంపీలు, సిబ్బంది ఉన్నారు. కాసేపట్లో ఎమర్జెన్సీ హెలికాప్టర్ పార్లమెంటు ఆవరణలో దిగడంతో ఎంపీల్లో ఆందోళన కలిగింది. అయితే ముందుజాగ్రత్త చర్యగా దానిని తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు. హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటన్ పార్లమెంటు) లో సమావేశాలు నిలిపేశారు. లండన్ చుట్టూ పోలీసు హెలికాప్టర్లు గస్తీకి దిగాయి.

కాగా, ఈ దాడికి బాధ్యులమంటూ ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. బ్రిడ్జిపై దాడిలో భారతీయులెవరైనా గాయపడి ఉంటే తమ సహాయక బృందాన్ని https://www.hcilondon.in/; 02086295950 ను సంప్రదించాలని భారత విదేశాంగ శాఖ సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Westminster Bridge  London Parliament  Terror Attack  

Other Articles