తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అస్తులను వేలం వేస్తున్నారు. దాదాపుగా 72 రోజుల పాటు అపోలో అస్పత్రిలో చికిత్స పోందిన జయలలిత.. అకస్మికంగా మృతి చెందడంతో తమిళనాడు రాష్ట్ర ప్రజలు తమ పెద్ద దిక్కును కోల్పోయినట్లు భావించి ఇంకా విషాదంలోనే వున్న సమయంలో.. శరవేగంగా తెరమీదకు వచ్చిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే అమ్మకు చెందిన అస్తులకు, రాజకీయానికి తామే వారసులమంటూ ఇటు శశికళ, అటు పన్నీరు సెల్వం.. మరోవైపు దీపా జయకుమార్ లు అసక్తికర వ్యాఖ్యలు పోరాటాలు చేస్తున్న క్రమంలోనే మరో వ్యక్తి తాను జయలలిత, శోబన్ బాబులకు పుట్టిన సంతానాన్ని అంటూ ఏకంగా కోర్టునే అశ్రయించాడు.
వీరందరూ ఇలా తామంటే తామంటూ వీధిపోరాటాలకు దిగుతున్న క్రమంలోనే అటు కర్ణాటక ప్రభుత్వం కూడా జయలలితపై న్యాయస్థానాన్ని అశ్రయించింది. అక్రమాస్థుల కేసులో అమ్మ అపరాధి అంటూ దేశసర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన నేపథ్యంలో అమ్మ మరణం అమెకు శిక్షను దూరం చేయగా, అమెకు విధించిన రూ. 100 కోట్ల అపరాధ రుసుమును మాత్రం వేరే మార్గంలో రాబట్టాలని ఉత్తర్వులను జారి చేసింది. దీంతో రంగంలోకి దిగిన కర్ణాటక ప్రభుత్వం ఈ తీర్పును పున:సమీక్షించాలని సుప్రీం తలుపు తట్టింది.
బెంగుళూరులోని పరప్పన అగ్రహార ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఖరారు చేసిందని, దీంతో జయలలిత మృతి చెందినా ఆమెకు విధించిన రూ.100 కోట్ల అపరాధ సొమ్మును చెల్లించాల్సి ఉందని న్యాయవాదులు బాలాజీ సింగ్, తామరై సెల్వన్ చెప్పారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. జయలలిత ఆస్తులను వేలం ద్వారా విక్రయించి జరిమానాను వసూలు చేయవచ్చని న్యాయమూర్తి కున్హా కూడా తీర్పులో వివరంగా తెలిపారన్నారు. త్వరలో ఆస్తులను వేలం వేయాలనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపనుంది. దీంతో త్వరలోనే అమ్మ అస్తులు వేలానికి రానున్నాయని దాంతో అపరాధ రుసుమును భర్తీ చేయనున్నారన్న వార్తలు తమిళనాడులో చక్కర్లు కోడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more