విద్యార్థినుల పట్ల అసభ్యంగా వ్యవహరించి.. వారిన అనవసర మానసిక అందోళనుకు గురిచేసిన దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. యూపీలోని ముజఫర్ నగర్ లోని ఓ వార్డెన్ తన హాస్టల్ లో వుంటున్న సుమారు 70 మంది విద్యార్థునులను వరస క్రమంలో నిల్చోబెట్టి మరీ అలనాటి ద్రౌపతి వస్త్రాపహరణం ఘటనను తాజాగా రిపీట్ చేయించింది. వార్డెన్ అంటే విద్యార్ధుల బాగోగులు చూడటంతో పాటు వారు ఉన్నత శిఖరాలను అందుకునేందుకు దోహదపడాల్సిన వ్యక్తగా రక్షణ కోసం నియమిస్తుంది ప్రభుత్వం. కానీ వార్డెన్ అన్న పదానికే పరాకాష్టగా నిలిచే ఇలాంటి వాళ్లు విద్యార్ధినులు భవిష్యత్లుతు కాలరాస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్ నగర్ కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల్ స్కూల్ కి చెందిన మహిళా వార్డెన్ ఆ హాస్టల్ విద్యార్ధినుల పట్ల వ్యవహరించిన తీరు పట్ల విద్యార్ధినులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ముజఫర్ నగర్ హాస్టల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు తక్షణం వార్డెన్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. హాస్టల్ ఎదుట నిరసన ప్రదర్శనకు దిగారు. వీరికి తోడుగా విద్యార్థినులు కూడా హాస్టల్ లోపల ధర్నాకు దిగారు.
విద్యార్ధినులు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ వార్డెన్ తాము వస్త్రాలను విప్పకపోతే చితకబాదుతానని హెచ్చరించిందని, దాంతో తామంతా బయపడి.. గత్యంతరం లేని పరిస్థితుల్లో అమె చెప్పనట్లు చేయాల్సి వచ్చిందని అవేదనను వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన జిల్లా విద్యాధికారులు వార్డెన్ ను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేశారు. విద్యార్ధినుల హాస్టల్ వార్డెన్ గా వున్నావారికి చైల్డ్ సైకాలజీ తెలిసివుండాలని, అందరినీ వరుసక్రమంలో నిల్చోబెట్టి వస్త్రాపహరణం చేయడం పట్ల వారు మానసికంగా కుంగిపోయే అవకాశం వుందని సైకాలజిస్టులు తెలిపారు. వారి భవిష్యత్ పై ఇలాంటి ఘటనలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అన్నారు.
అయితే వార్డెన్ మాత్రం తాను చేసిన తప్పిదాన్ని సమర్ధించుకునేందుకు ప్రయత్నంచేసింది. బాత్ రూమ్ గోడతో పాటు వాష్ రూంలో ఓ చోట రక్తపు మరకలు కనిపించాయని అన్నారు. ఈ విషయమై విద్యార్ధులను అడిగినా చెప్పరని భావించి వారి బట్టలు విప్పించానన్నారు. తాము ఎదుర్కోంటున్న సమస్యపై చెప్పేందుకు విద్యార్థినులు ఇబ్బంది పడే అవకాశం వున్నందున తాను ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. ఒకరి వల్ల మిగతావారి అరోగ్యాలకు హాని కలగకుండా వుండేందుకు ఈ పనిచేయాల్సి వచ్చిందన్నారు. అయితే చదువుల విషయంలో తాను కఠినంగా వుండటం వల్లే విద్యార్థినులకు తానంటే ఇస్టం వుండదని, దీనికి తన సహచర సిబ్బంది కూడా కొందరు అజ్యం పోయడంతోనే ఇలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయని చెప్పుకోచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more