వైరల్ వీడియో: ప్రాణాలు పోతుంటే వీడియో తీసింది | an Ethiopian Domestic Worker Falling in Kuwait.

Kuwaiti woman filmed ethiopian maid window fall

Ethiopian Domestic Worker, Kuwait Woman Maid Video, Ethiopian Maid Video, Maid Fall Down, Woman Filmed Maid, Suicide Attempt Filmed, Owner Filmed Maid Suicide, Fall Down Video, Kuwait Horrific Video

Horrific Video of an Ethiopian Domestic Worker Falling in Kuwait Must Prompt Change. Kuwaiti woman investigated over Ethiopian maid's window fall.

ITEMVIDEOS:ఆమెకు అసలు మానవత్వం ఉందా?

Posted: 04/01/2017 08:22 AM IST
Kuwaiti woman filmed ethiopian maid window fall

కువైట్ లో జరిగిన ఓ ఘటన పై అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. తన ఇంట్లో పని చేసే ఇథియోపియన్ పని మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా వీడియో తీసి ఆనందించిన యజమానిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైపోయారు. తనను కాపాడాలంటూ అరుస్తున్నా పట్టించుకోకుండా పైశాచిక ఆనందం పొందిన ఆమెపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే...

కువైట్ లో ఓ ఇంట్లో ఇథియోపియాకు చెందిన ఓ వితంతు మహిళ పని చేస్తోంది. తీవ్ర కష్టాల్లో ఉన్న ఆమె ఒకరోజు ఆత్మహత్యాయత్నం చేసింది. ఏడో అంతస్తు ఎక్కి దూకేసింది. అయితే చివరి నిమిషంలో జీవితం మీద ఆశపుట్టిందేమో వేలాడుతూ తన ప్రాణాలు కాపాడాలంటూ కేకలు వేసింది. అదంతా అక్కడే ఉండి చూస్తున్న యాజమానురాలు ఆమెను అడ్డుకునే యత్నం చేయలేదు సరికదా, వీడియో తీస్తూ ఆనందించింది. ఇక బాల్కనీలో వేలాడుతున్న ఆ పనిమనిషి తనను కాపాలని ప్రాధేయపడింది.

కానీ, యజమానురాలు పట్టించుకోలేదు. ఇంతలో ఆమె అక్కడి నుంచి పట్టుతప్పి కళ్లముందే కిందపడిపోయింది. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. అయితే ఆమె చనిపోయిందన్న వార్తలు తొలుత ప్రసారం కాగా, గాయాలపాలైన ఆమెను కాపాడి ఆసుపత్రిలో చేర్పించిన మరో వీడియో తర్వాత విడుదలైంది. మానవత్వం లేకుండా వ్యవహరించిన మహిళపై పలువురు ఆగ్రహాం వ్యక్తం చేశారు. తమ దగ్గర పని చేసేవారి సంరక్షణ యజమానుల బాధ్యతేనని పేర్కొన్న మానవ హక్కుల సంఘం ఆమెను అరెస్ట్ చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశించింది కూడా.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kuwait  Ethiopian Maid  Fall Down Video  

Other Articles