ఏ మీట నొక్కొనా వాళ్లకే ఓట్లు వెళ్తున్నాయ్.. Union Minister mocks Arvind Kejriwal for EVM allegation

Arvind kejriwal meet election commission over tampering row call for ballot paper polling

arvind kejriwal, Electronic voting machinew, free and fair elections, evm tampering, evm tampering arvind kejriwal, Chief Election Commissioner, Nasim Zaidi

Voicing concerns over alleged tampering of EVM machines, Aam Aadmi Party chief Arvind Kejriwal met Chief Election Commissioner Nasim Zaidi and called for a tamper-free election.

ఏ మీట నొక్కొనా వాళ్లకే ఓట్లు వెళ్తున్నాయ్..

Posted: 04/01/2017 08:14 PM IST
Arvind kejriwal meet election commission over tampering row call for ballot paper polling

పంజాబ్ లో తమ పార్టీ ఓటమి పాలుకావడానికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎం) ట్యాంపరింగే కారణమని ఆరోపించిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘాన్ని కలిశారు. తన వాదనను సీఈసీకి విన్నవించారు. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలు తమ పార్టీకే అనుకూలంగా వుండటంతో పాటు బీజేపి అకాళీ పార్టీలకు సింగిల్ డిజిట్ స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పినా.. వాటికి అధిక స్థానాలు రావడం,, తమ పార్టీకి స్థానాలు తగ్గడంపై అయన అనుమనాలు వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా  అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. 'ఈ దేశంలో ఎన్నికలు సజావుగానే జరుగుతున్నాయా? ప్రజలు ఓటు వేస్తున్నారా? లేక మిషన్లే నిర్ణయిస్తున్నాయా?' అని కేజ్రీవాల్ సందేహాలు వ్యక్తం చేశారు. మిషన్ లోని సాఫ్ట్‌వేర్ మార్పు వల్ల ఓటర్లు ఓ బటన్ నొక్కినా ఆ ఓట్లు బీజేపి పార్టీకే వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. మిషన్లను తనిఖీ చేయకపోవడం వల్ల ప్రజాస్వామ్యమే ప్రశ్నార్థకంగా మారుతోందన్నారు.

ట్యాంపరింగ్‌కు అవకాశం లేని ఎన్నికలకు ఆయన పిలుపినిచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని ఎన్నికల కమిషన్ చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. పెద్దఎత్తున ట్యాంపరింగ్ జరుగుతోందన్నారు. ప్రతి మిషన్‌ను ఎన్నికల కమిషన్ పరీక్షిస్తోందా లేదా అని తాను సీఈసీని అడిగినట్టు చెప్పారు. 'నేను ఐఐటీ నుంచి వచ్చాను. సాంకేతిక విషయాలపై నాకు అవగాహన ఉంది. ఓట్లన్నీ బీజేపీకే ఎలా వెళ్తున్నాయి? బీజేపీ ఏది కాంగ్రెస్ ఏదనేది మిషన్లకు ఎలా తెలుస్తుంది. ఇది హార్డ్‌వేర్ సమస్యా సాఫ్ట్‌వేర్ సమస్యా' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles