ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ అడుగుపెట్టి అప్రతిహాసంగా దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ తన ఖాతాలో తొలిసారి ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ ను వేసుకుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ లో కేవలం సెమీఫైనల్స్ వరకు మాత్రమే పరిమితమైన సింధూ.. రెట్టించిన ఉత్సహాంతో అద్బుత ప్రదర్శన చేసి 2017 ఇండియన్ ఓపెన్ సిరీస్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మన తెలుగు తేజం ఘన విజయం సాధించింది.
దీంతో సింధూ కెరీర్లో ఇది రెండో సూపర్ సిరీస్ టైటిల్ కాగా ఓవరాల్‌గా తొమ్మిదొవ టైటిల్. ఇదిలావుండగా, ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సింధూ ప్రతీకారం కూడా తీర్చుకుంది. రియో ఓలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మొదటి సెట్‌ను 21-19తో నెగ్గిన సింధూ సెకండ్ సెట్‌ను 21-16తో గెలిచి సత్తా చాటింది. దీంతో సింధూ ఇండియా ఓపెన్ డ్రీమ్‌ను నెరవేర్చుకుంది. ప్రస్తుతం ఐదో ర్యాంక్‌లో ఉన్న సింధూ అగ్ర స్థానం దిశగా దూసుకెళుతోంది.
ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్ లో విజయం సాధించిన సింధూపై ప్రశంసల వర్షం కురుస్తుంది. సింధూను అభినందిస్తూ ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు యావత్ దేశంలోని నెట్ జనుల నుంచి ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. సోషల్ మీడియాలో సింధూ విజయం ప్రస్తుతం ట్రెడింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో అటు రాజకీయ నేతల నుంచి కూడా సింధూకు అభినందనలు అందుతున్నాయి. సిందూ విజయంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు. ట్విట్టర్ వేదికగా సింధూకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలానే మరిన్ని విజయాలు నమోదు చేయాలని ఆయన ఆకాంక్షించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more