ఇదేం క్యాబినేట్ రా నాయనా... వీళ్ల స్పెషాలిటీ ఏంటో తెలుసా? | Special Cabinet in Andhra Pradesh Government.

All party mlas in andhra pradesh cabinet

Andhra Pradesh Cabinet Expansion, All Party Cabinet, All Party MLAs in AP Cabinet, All Party MLAs Chandrababu Naidu, YSRCP BJP TDP Cabinet, Chandrababu Special Cabinet, BJP YSRCP AP Cabinet

After Andhra Pradesh Cabinet Expansion 11 new faces, including Lokesh, in Cabinet. 4 from YSRCP make it. Already Two BJP MLAs there. At last AP Cabinet was All Party Cabinet Now.

చంద్రబాబుది ఓ విచిత్రమైన కేబినెట్

Posted: 04/03/2017 09:23 AM IST
All party mlas in andhra pradesh cabinet

నవ్యాంధ్ర రాష్ట్రంలో తొలి ప్రభుత్వం కొలువు దీరాక దాదాపు మూడేళ్ల తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరపటం తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. లోకేష్, అఖిలప్రియ లాంటి యువ నేతలకు మంత్రిగా పగ్గాలు, ఐదుగురు ఊస్టింగ్ మంత్రుల తీవ్ర వ్యాఖ్యలు, అటుపై అసంతృప్తుల నుంచి నిరసన సెగ, రాజీనామాలు, అలకలు ఇలా ఆదివారం నుంచి మొదలైన రాజకీయాల సెగలు మరింత రాజుకుంటున్నాయి. అదే సమయంలో ప్రస్తుతం కొలువుదీరిన కొత్త కేబినెట్‌ లో విచిత్ర పరిస్థితి నెలకొంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఇందులో మంత్రి పదవులు దక్కటమే ఇక్కడ అసలు చర్చకు కారణమైంది.

టెక్నికల గా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న నలుగురికి కేబినెట్ లో బెర్త్ దక్కటం తో ఈ పరిస్థితి ఏర్పడింది. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పటికే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండగా, తాజాగా జంపర్లు కూడా అమాత్యులు అయిపోవటంతో ఏపీ మంత్రివర్గం ‘ఆల్‌పార్టీ కేబినెట్’గా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వారిలో పలు దఫాలుగా 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. స్పీకర్ వారిపై ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోవటంతో వారు ఇప్పటికీ వైసీపీ సభ్యులుగానే కొనసాగుతున్నారు.

మొన్న ముగిసిన బడ్జెట్ సమావేశాల్లో పార్టీల సంఖ్యా బలంపై అసెంబ్లీ సెక్రటరీ ఇచ్చిన నోట్ లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ బలం 66 అని తేల్చింది. ఈ లెక్కన వారింకా వైసీపీ సభ్యులు గానే ఉన్నట్లు లెక్క. ఇక బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రి వర్గంలో ఉండగా, ఇప్పుడు నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. ఆరు ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో కొత్త రూపు సంతరించుకున్న ఈ మంత్రి వర్గంలో ప్రతిపక్ష సభ్యులు అయి ఉండి కూడా మంత్రులుగా అధికారం చెలాయించబోతుండటం కొసమెరుపు. బహుశా దేశంలో ఇలాంటి మంత్రివర్గం బహుశా ఇదేనేమోనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు పొలిటికల్ పండితులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Chandrababu Naidu  New Cabinet  All Party MLAs  

Other Articles