అంబులెన్స్ లో చిన్నారి.. అడ్డుకున్న పోలీసులు... ప్రజలు ఏం చేశారో చూస్కోండి | People took on the police to save a Child.

People defy the police save a child life in delhi

People Took Police, Rajghat Traffic Video, Making way for Ambulance, Delhi People Traffic Signal Video, People Clear Route Ambulance, Ambulance Child, Stupid Rules, Cop Child Ambulance, Police Stop Ambulance

Delhi People took on the police to save a Child severely bleeding in Ambulance near Rajghat Signal.

ITEMVIDEOS:మానవత్వం గెలిచింది.. చిన్నారి బతికింది

Posted: 04/04/2017 11:11 AM IST
People defy the police save a child life in delhi

ఒక కాకి చనిపోతే వంద కాకులు చేరి అరుస్తాయి..ఏడుస్తాయి,బాధ పడుతాయి. నీటిలో స్నానం చేస్తాయి. ఒక దాని బాధ మరొకటి కలిసి పంచుకుని ఓదార్చుకుంటాయి. కానీ, మాయదారి మనుషులకే ఏమైందన్న భావన ఒక్కోసారి కలగక మానదు. సాయం చేసే గుణం లేకపోగా, ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అటువైపు ఓ లుక్కు కూడా వేయకుండా మనకెందుకు లే అని ఎవరి పని వారు చేసుకుంటూ పోతుంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పుకోబోయే సందర్భం వింటే మనుషుల్లో మానవత్వం ఇంకా బతికే ఉందని ఒప్పుకోక తప్పదు.

అది ఏప్రిల్ 1, ఢిల్లీలోని రాజ్ ఘట్ రింగ్ రోడ్ దగ్గర ఓ ట్రాఫిక్ సిగ్నల్. టైం సరిగ్గా తెలీకపోయిన మధ్యాహ్నాం సమయంలో అని తెలుస్తోంది. తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న ఓ చిన్నారిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇంతలో పోలీసులు కొందరు వీఐపీ లు వస్తున్నారంటూ లా అండ్ ఆర్డర్ పేరిట హడావుడిగా బారికేడ్లతో రోడ్డును బ్లాక్ చేసేశారు. ఆంబులెన్స్ లో ఉన్న పాప తల్లిదండ్రుల్లో కలవరం. వేడుకున్నా కదలనిచ్చే ప్రసక్తే లేదని పోలీసులు తేల్చేశారు.

ఇంతలో చుట్టుపక్కల ఉన్న కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆంబులెన్స్ ను అనుమతించాలని కోరారు. వారికి అదే సమాధానం రావటంతో ఆగ్రహాం చెందారు. పనికి రాని రూల్స్ తో పాపకు ఏమైనా జరిగితే బాధ్యత ఎవరిదంటూ ప్రశ్నించారు. ఇంతలో ఓ యువకుడు ధైర్యం చేసి బారికేడ్ ను లాగేశాడు. మిగతా వారంతా తమ వాహనాలను పక్కకు జరిపి లాగి అంబులెన్స్ కు దారి ఇచ్చారు. అప్పటిదాకా మొండిగా ఉన్న పోలీసులు ప్రజలంతా ఒకే తాటిపై ఉండటంతో ఆ టైంలో సైలెంట్ గా ఉండటమే మంచిదని సైడ్ ఇచ్చారు.

అంబులెన్స్ వెళ్లిపోయాక మళ్లీ బారికేడ్లు మూసేయమని చెప్పి వేచి చూశారు. ఇదంతా ఓ వ్యక్తి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా, ఇప్పుడది వైరల్ అవుతోంది. అటుపై ఆ చిన్నారి ప్రాణాలు నిలబడ్డాయన్న వార్త మీడియాలో రావటంతో కలిసికట్టుగా మానవత్వం చూపిన వారందరికీ సలాం అంటూ కామెంట్లు పడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi People  Save A Child  Stupid Rules  

Other Articles