టీవీ కమర్షియల్ అడ్వరైజ్మెంట్లకు ఉన్న గిరాకీ అంతాఇంతా కాదు. వీటినీ చిత్రీకరించడానికి కంపెనీలు ఏకంగా సినిమా తీసే రేంజ్ లో డబ్బులను వెచ్చిస్తుంటాయి. వీటితోనే తమ ఉత్సాదనలను విక్రయించాలి కాబట్టి.. వాటికి అధిక ప్రాధాన్యతనిస్తుంటాయి. అయితే ఇప్పటికే అనేక టీవీ వాణిజ్య ప్రకటనలు వస్తుండగానే వాటిని మన ఇంట్లోని పిల్లలు ముందుగానే చెప్పేస్తుంటారు. ఈ కోవలో సోషల్ మీడియాలో కూడా ఈ వాణిజ్య ప్రకటను దుమ్ముదులుపుతుంటాయి. ఈ క్రమంలోనే మన పోరుగు దేశమైన బంగ్లాదేశ్ లో రూపోందించబడిన ఒక వాణిజ్య ప్రకటన ఎంతగా వైరల్ అయ్యిదంటే.. ఇప్పటికే ఈ వీడియోను 47 లక్షల మంది వీక్షించారు. అంతేకాదు లక్షల మంది షేర్ కూడా చేసుకున్నారు.
అసలు ఇంతకీ ఈ వాణిజ్య ప్రకటనలో వున్న గోప్పదనం ఏంటీ అంలే ఏడిపించడమే. మరోలా చెప్పాలంటూ మహిళలు అనేక మంది ఎదుర్కోంటున్న సమస్యపైనే ఈ యాడ్ రూపోదించడమే. అనేక మంది మహిళల చేత కంటతడి పట్టిస్తూ.. రానురాను మరింత మందికి చేరువవుతుంది. సామాజిక సమస్యలకు అద్దంపట్టేలా రూపొందే యాడ్స్ లో ఈ ప్రకటనను బెస్ట్ యాడ్స్ ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయడగా, రమారమి అరకోటి మందికి చేరువలో వీక్షకులు దీనిని వీక్షించారు.
పురషహంకార, అధిపత్య సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టేలా ఈ యాడ్ రూపొందడం విశేషం. కేవలం రెండు నిమిషాల ఒక్క సెకెను నిడివిగల ఈ యాడ్ లో... ఓ మహిళ తన స్నేహితురాళ్లతో కలిసి ఒక బ్యూటీ పార్లర్ కు ఆనందంగా వస్తుంది. స్నేహితురాళ్లంతా ఫేషియల్, హెయిర్ కర్లింగ్ చేయించుకుంటే... ఆమె మాత్రం తన జుట్టు కత్తిరించాలని సూచిస్తుంది. ఆమె జట్టును చూసిన షాప్ కీపర్... 'ఎంత అందమైన జట్టు' అంటూ మెచ్చుకుంటుంది. 'చివర్లు కత్తిరిస్తే సరిపోతుందా? మేడమ్' అని అడుగుతుంది. ఇంకా కత్తిరించాలని ఆమె సూచిస్తుంది.
ఇలా ఇంకోంచెం, ఇంకోంచెం అంటూ పొడవుగా వున్న జుట్టును బాబ్ కట్ గా మార్చిన తరువాత కూడా మరింత చిన్నగా అంటుంది. కాస్త మోడ్రన్ గా కత్తిరించి 'ఇది సరిపోతుంది మేడమ్...చాలా బాగున్నారు' అంటూ హెయిర్ స్టైలిస్ట్ అద్దాన్ని చూపిస్తుంది. దాంతో విస్తుపోయిన హెయిర్ స్టైలిస్ట్.. అలా చూస్తుండగానే.. ఒకచేత్తో జుట్టు పట్టుకుని, 'ఇంకా కత్తిరించండి... నా జుట్టు పట్టుకుని ఎవరూ కొట్టకుండా ఉండేంతలా కత్తిరించండి' అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. దీంతో ఆ సెలూన్ లో వున్న మహిళలందరూ.. ఒక్కసారిగా అమెను చూస్తారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఎత్తిచూపే ఈ యాడ్ ను మీరూ చూసేయండీ..!
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more