అర్కే నగర్ ఉపఎన్నికలలో వింత పోకడ.. డమ్మీ మమ్మీతో ప్రచారం.. Campaign in R.K. Nagar hits new low with dummy coffin of Jayalalithaa

Campaign in r k nagar hits new low with dummy coffin of jayalalithaa

Jayalalithaa, AIADMK, Dummy body, Dead body, RK Nagar bi-election, election commission, panner selvam, dummy mummy, deepa jaya kumar, ttv dinakaran, shasikala, deepa jayakumar, Chennai, politics

AIADMK (Puratchi Thalaivi Amma) party hitting the streets on a campaign vehicle with a dummy coffin with Jayalalithaa’s figurine mounted on the bonnet seeking “justice” for her death.

అర్కే నగర్ ఉపఎన్నికలలో వింత పోకడ.. డమ్మీ మమ్మీతో ప్రచారం..

Posted: 04/07/2017 08:35 AM IST
Campaign in r k nagar hits new low with dummy coffin of jayalalithaa

తమళినాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అకస్మిక మరణంతో ఖాళీ అయిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికలలో రాజకీయ పార్టీలు మరీ దిగజారి ప్రచారాన్ని చేస్తున్నాయి. అమ్మ ఆత్మ ఇంకా తమతోనే వుందని పేర్కోంటూ ఏకంగా ఒక డమ్మీ మమ్మీని రూపోందింది.. దానిని తమ ఎన్నికల ప్రచార వాహనంపై పెట్టి.. దాని పక్కన తమ ఎన్నికల గుర్తును కూడా సూచిస్తూ అభ్యర్థులు ప్రచారం చేసి.. అమ్మ పట్ల తమిళానాడ వున్న ప్రజాధారణను సొమ్మ చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే అది కాస్తా విమర్శల పాలు కావడం.. ఎన్నికల సంఘం అదేశాలతో పోలీసులు వచ్చి అడ్డుకోవడంతో ఎట్టకేలకు పోలీసులు దానిని తొలగించారు.

అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడం.. ఈ నేపథ్యంలో అధికారం వారు పోందినా.. అసలైన అన్నాడీఎంకే తమదేనని ప్రచారం చేసుకుంటున్న పన్నీరు సెల్వం వర్గం.. తమ పార్టీకి అమ్మ మద్దతు కూడా వుందని, అందుకనే అమ్మ ఆత్మ కూడా తమతోనే వుందని ప్రచారం చేసుకున్నారు. ఇందులో భాగంగా అమ్మ మరణించినప్పుడు వున్న శవపేటిక మాదిరిగా ఒక డమ్మీ బొమ్మను రూపోందించి... దానినిపై జాతీయ జెండా అకారంతో పాటు మరోవైపు తమ పార్టీ గుర్తును కూడా పోందుపర్చి ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు పన్నీరు సెల్వం వర్గం రెడీ అయ్యింది. ఇలా వీధుల్లోకి వెళ్లి ప్రచారం చేయడంతో పిర్యాదులు అందుకున్న ఎన్నికల కమీషన్ దానిని నిలిపివేయాలని అదేశించడంతో పోలీసులు వెళ్లి దానిని తొలగించారు.

అయితే పన్నిరు సెల్వం వర్గం ఈ చర్యతో అమ్మ ఆత్మ తమతోనే వుందని.. అధికార పార్టీని ఇరుకున పెట్టి.. అమ్మ మరణానికి కారణాలు చెప్పాలని, అమ్మను పొట్టనబెట్టుకున్నారని ప్రచారం చేయాలని భావించినప్పటికీ.. అర్కే నగర్ ప్రజల నుంచి మాత్రం ఏవగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు తలెత్తాయి. అమ్మపై అభిమానం వుంటే అమె పటంతో ప్రచారం చేయాలని కానీ.. అమె శవపేటికతో రాజకీయాలా..? అంటూ నిలదీస్తున్నారు. తమిళుల అమ్మ ఏ ఒక్కరి సొత్తు కాదని, తమిళల అభిమానులందరిదన్న వాదనలు తెరపైకి స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి చీఫ్ ట్రిక్స్ కు రాజకీయ పార్టీలు పాల్పడకూడదని కూడా ప్రజలు సూచనలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  AIADMK  Dummy body  Dead body  RK Nagar election  Chennai  

Other Articles