మంత్రి నివాసంపై ఐటీ దాడులు.. నటుడి ఇంట్లోనూ సోదాలు.. IT department raids premises of TN minister Vijayabhaskar

It department raids premises of tn minister vijayabhaskar

C Vijayabaskar, , TN health minister, I-T raids, sarath kumar, TTV Dinakaran, palanisamy, pannerselvam, deepa jayakumar, politics

The Income Tax department has raided multiple properties of health minister C Vijayabaskar, including actor-turned-politician Sarath Kumar who had voiced his support for TTV Dhinakaran

మంత్రి నివాసంపై ఐటీ దాడులు.. నటుడి ఇంట్లోనూ సోదాలు..

Posted: 04/07/2017 10:12 AM IST
It department raids premises of tn minister vijayabhaskar

తమిళనాడులోని పళనిస్వామి ప్రభుత్వానికి మరో ఇబ్బందికర పరిణామం ఎదురైంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన అర్కే నగర్ ఉపఎన్నికలకు సరిగ్గా ఐదు రోజుల ముందు ఐటీ అధికారులు తమిళనాడులోని పలువురు అధికార పార్టీకి ప్రముఖలపై, అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్న నేతలపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర అరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ కి సంబంధించిన పలు ఆస్తులు, ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు.

ఆర్కే నగర్  ఉప ఎన్నికలలో అధికార పార్టీ సభ్యులు విచ్చలవిడిగా డబ్బును పంచుతున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం విశేషం. ముఖ్యంగా రాష్ట్ర అరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ధన ప్రవాహంతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని నాలుగు కేసులు నమోదు కావడంతో ఆయన ఇంటితో పాటు సన్నిహితుల ఇళ్లపై కూడా అదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టారు. మంత్రి నేరుగా డబ్బులు పంచుతున్నారని, ఓటర్లను కొంటున్నారని పిర్యాదులు అందినట్లు ఐటీ అధికారోకరు తెలిపారు.

ఇదే సమయంలో ఎంజీఆర్ మెడికల్ యూనివర్శిటీ వైస్ చాన్సిలర్ డాక్టర్ ఎస్ గీతాలక్ష్మీ నివాసంలోనూ అధికారులు దాడులు నిర్వహించారు. అమె ఇటీవలే అత్యంత ప్రతిష్టాత్మకమైన బిసి రాయ్ అవార్డును రాష్ట్రపతి చేతులు మీదుగా అందుకున్నారు. అయితే అమెకు మంత్రివర్యులకు మంచి సంబంధాలున్నాయన్న నేపథ్యంలో అమె ఇంటిపై కూడా అధికారులు దాడులు నిర్వహించారు. ఇప్పటివరకూ తిరుచ్చి, పుదుకొట్టాయ్ జిల్లాల్లో 13 ప్రాంతాల్లో, చెన్నైలో 19 చోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

అటు అమ్మ అన్నాడీఎంకే పార్టీ సభ్యుడు టీటీవీ దినకరణ్ కు మద్దతు ప్రకటించి 24 గంటలు కూడా గడవక ముందే ఏఐఎస్ఎం పార్టీ అధినేత , ప్రముఖ నటుడు శరత్‌ కుమార్ నివాసంపై అధికారులు దాడుల చేశారు. కొట్టివక్కంలోని ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. శరత్ కుమార్ కు చెందిన ఆస్తులతో పాటు మరికొందరు ప్రముఖ పారిశ్రామిక వేత్తల ఇళ్లలోనూ ఐటీశాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఇవాళ వేకువజాము నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నైతో పాటు తిరుచ్చి, పుదుకొట్టాయ్ జిల్లాల్లో దాదాపు 30 చోట్ల తనిఖీలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles