ఇస్లాం మతనుసారం ట్రిపుల్ తలాక్ వర్తిస్తుందని కొందరు పత్వాలు జారే చేస్తున్న నేపథ్యంలో.. అటు ఈ అంశంపై తాము నిర్ణయం తీసుకున్నామనే తమకు ముస్లిం మహిళలు ఓట్లు వేశారని బీజేపి పార్టీ చెబుతున్న తరుణంలో.. ఈ అంశం ఇటు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఈ అంశంపై ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ సతీమణి సల్మా అన్సారీ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడుసార్లు తలాక్ అని చెప్పినంత మాత్రానా అది విడాకులుగా భావించరాదని చెప్పారు.
పెళ్లి చేయడం అన్నది భారత దేశంలోని పేద కుటుంబాలకు ఎంతో భారమని, అయినా వారి తాహత్తుకు తగ్గట్లుగా ఆడపిల్లల తల్లిదండ్రులు తమ బిడ్డ నూరేళ్లు చల్లగా జీవిస్తుందన్న అశతో అప్పులు చేసి మరీ వివాహాలు చేస్తున్నారని అన్నారు. భర్తో, భార్యో మూడు సార్లు తలాక్ అన్నంత మాత్రాన అది విడాకులు కాబోదని తేల్చిచెప్పారు. ముస్లిం మహిళలకు ఈ సందర్భంగా ఓ విషయం చెప్పారమె. ముస్లిం మహిళలు ఖురాన్ చదవాలని అన్నారు. మత పెద్దలు చెప్పేవాటినే గుడ్డిగా పాటించడం కాకుండా ఖురాన్ చదివితే అందులో అసలు ఏముందనేది తెలుస్తోందన్నారు.
మౌలానాలు ఏం చెప్పితే అది నిజమని నమ్మకూడదని, అనేక మంది మౌలనాలు, మత పెద్దలు వారి భావాలనే వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అరబిక్‌లో ఉన్న ఖురాన్‌ను చదవితే.. అందులో ఏముందో తెలుస్తుందని, అనువాద ఖురాన్ ను కూడా ఇష్టానుసారంగా మారుస్తున్నారని అమె అభిప్రాయపడ్డారు. విడాకుల విషయంలో షారియత్ ఏం చెబుతోందో అప్పుడే స్పష్టంగా తెలుసుకోవచ్చునన్నారు. అలీఘడ్‌లోని అల్ నూర్ చారిటబుల్ సొసైటీ చాచా నెహ్రూ మదర్సాలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more