అర్కేనగర్ ఉపఎన్నికలను రద్దు చేసే యోచనలో ఎన్నకల సంఘం RK Nagar by-poll may be cancelled by election commission

Rk nagar by poll price of one vote is rs 4000 reveals income tax official

RK Nagar by-poll, Income Tax department, VK Sasikala, Election Commission, AIADMK, vijay kumar, geeta lakshmi, sharath kumar, palanisamy, ttv dinakaran, tamilnadu

According to the documents seized by the IT officials during their raids in Chennai, the price of one vote in the by-poll bound RK Nagar constituency is Rs 4,000.

అర్కేనగర్ ఉపఎన్నికలను రద్దు చేసే యోచనలో ఎన్నకల సంఘం.?

Posted: 04/09/2017 12:28 PM IST
Rk nagar by poll price of one vote is rs 4000 reveals income tax official

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన డాక్డర్ రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 12న జరగనున్న ఉపఎన్నికలు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేశారని ఆధారాలతో సహా బయటపడటంతో మరో రెండు రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్‌ రద్దు చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈసీ త్వరలో నిర్ణయాన్ని వెలువరించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

తమిళనాడు రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ మంత్రితో సాటు నటుడు శరత్ కుమార్, ఎంజీఆర్ మెడికల్ కాలేజీ వైస్ చాన్సిలర్ గీతాలక్ష్మి నివాసాలపై జరిపిన దాడుల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా, నియోజకవర్గంలో తమకు పట్టుబడ్డ నగదు, తాయిలాల వివరాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్‌ లఖానీ, ప్రత్యేక ఎన్నికల అధికారి విక్రమ్ బాద్రాతో పాటు పలువురు అధికారులు ఆగమేఘాలపై ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తమిళనాడు ఉప ఎన్నికల విషయమై వారు చర్చిస్తున్నారని సమాచారం.

ఒక్కో ఓటుకు దాదాపు రూ.4వేలు చెల్లించారని తెలుస్తోంది. నగదు బట్వాడాకు తగ్గ ఆధారాలు లభించడం, అమ్మ, పురట్చితలైవి శిబిరాలు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కి ఉండడం వెరసి ఎన్నికల నిర్వహణ మీద  కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నజీంజైదీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దృష్ట్యా, రద్దు విషయంలో వెనక్కు తగ్గుతారా, వాయిదా వేస్తారా అని విస్తతంగా చర్చ జరుగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamil nadu  rk nagar by-polls  election commission  AIADMK  vijay kumar  IT raids  

Other Articles