ఓటుకు నోటు వ్యవహారం ప్రకంపనలతో ఆర్కే నగర్ ఎన్నికలు వాయిదా పడటం తెలిసిందే. అయితే ఎన్నికల సంఘం, కేంద్రం కూడ గలుపుకుని కుట్ర చేసి మరీ తనని ఇందులో ఇరికించారని శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్ చెబుతున్నాడు. తాను గెలవటం ఇష్టం లేకనే ఈసీ లేని పోని ఆరోపణలను ఆధారంగా చేసుకుని ఎన్నికలను వాయిదా వేయించిందని మీడియా ముందు వాపోయాడు.
అయితే ఉపఎన్నికలు వాయిదా పడటంతో ఇన్నాళ్లు తెరిపి ఇచ్చిన పన్నీరు సెల్వం వర్గం మళ్లీ విమర్శల దాడులు మొదలుపెట్టింది. ఉపఎన్నిక వాయిదా తమకే అడ్వాంటేజ్ అవుతుందన్న ఆ పార్టీ దినకరన్ ను ఓ క్రిమినల్ గా అభివర్ణిస్తోంది. మాజీ మంత్రి, అన్నాడీఎంకే(పురిచ్ఛితలైవి అమ్మ) నేత కేపీ మునుస్వామి మాట్లాడుతూ దినకరన్ ఓ స్వార్థ పరుడని, దిగజారుడు రాజకీయాలకు తెరలేపాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఆర్కేనగర్ లో నగదు పంపిణీలో దినకరన్ పాత్ర ఉందని ప్రపంచమంతా తెలిసిపోయిందని, అతని రాజకీయ జీవితం ఇక ముగిసినట్లేనని, చిన్నమ్మ లాగే ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నాడు.
కేవలం తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు ఆరుగురు మంత్రులను దినకరన్ బలిపశువులను చేశారని మండిపడ్డాడు. తక్షణమే ఈసీ దినకరన్ ను అనర్హుడిగా ప్రకటించాలని కోరాడు. అంతేకాదు డీఎంకే నేతలు కూడా డబ్బులు విరజిమ్మారని మునుస్వామి ఆరోపిస్తున్నాడు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తమ అభ్యర్థి మధుసూదనన్ విజయం ఖాయమని ప్రకటించాడు. కాగా, ఎన్నికల కోసం అభ్యర్థులకు డబ్బు ఎర వేశారన్న ఫిర్యాదులపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఎన్నికలకు మూడు రోజుల ముందు ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం
విదితమే.
డీఎంకే కొత్త డిమాండ్
నగదు పంపిణీకి పాల్పడ్డ అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేస్తోంది. మంత్రి విజయభాస్కర్ తో పాటు, ఇందులో ప్రమేయమున్న మంత్రులందరినీ బర్తరఫ్ చేయాలని కోరుతోంది. అంతేకాదు ముఖ్యమంత్రి పళనీస్వామిపై సీబీఐతో విచారణ జరిపించాలని కూడా కోరుతోంది. ఈ నేపథ్యంలో, తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావును ముంబైలో నేడు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే నేతలు కలవనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more