పళనిస్వామి ప్రభుత్వాన్ని దినకరణ్ హెచ్చరికలు.. ttv dinakaran warns palaniswamy government

Ttv dinakaran warns palaniswamy government

palani swamy, panner selvam, shasikala, aiadmk, AIADMK General Secretary, Jayalalithaa, PoliticalPlay, Tamilnadu

Delhi Police has issued a lookout notice against AIADMK leader TTV Dhinakaran, accused of bribing an EC official to get the coveted 'two-leaves' symbol for his faction.

పళనిస్వామి ప్రభుత్వాన్ని దినకరణ్ హెచ్చరికలు..

Posted: 04/19/2017 11:12 AM IST
Ttv dinakaran warns palaniswamy government

తమిళనాడు అన్నాడీఎంకేలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత మరణించిన తరువాత.. పార్టీ పగ్గాలను అందుకోవాలని.. పార్టీపై అధిసత్యం చెలాయించాలని భావించిన శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించడం.. ఇక రెండు వర్గాలుగా చీలిన అన్నాడీఎంకే వర్గాలు ఒక్కటి కావడానికి రంగం సిద్దం కావడం.. ఇలా ఒకోక్కటిగా అన్ని శశివర్గానికి వ్యతిరేకంగా జరిగిపోతున్నాయి. కాగా, శశికత వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామన్న వార్తలను... పది మంది ఎమ్మెల్యేలు విభేధించారు. వారంతా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ తో సమావేశమయ్యారు.

తమతో చర్చించకుండానే మంత్రి జయకుమార్ చిన్నమ్మ, దినకరన్ కుటుంబాలను పక్కనపెట్టాలని నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అసలే ఆర్కేనగర్ ఉప ఎన్నిక రద్దు, ఎన్నికల కమీషన్ కే లంచం ఇవ్వజూపిన కేసులో ఇబ్బందులు ఎదుర్కోవడం.. అటు ఫెరా కేసుల కోసం న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి రావడం వంటి పరిణమాలతో ఇబ్బందులు పడతున్న దినకరన్ కు మేనత్త శశికళ ములాఖాత్ లో కలిసేందుకు కూడా విముఖత వ్యక్తం చేయడంతో.. అసలు తాము ఎక్కడికి పోతున్నామన్న భయం దినకరణ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. అటు కేంద్రం తమ అదుపాజ్ఞల్లో ప్రభుత్వాన్ని నడిపించాలని భావిస్తుందని.. ఈ క్రమంలో తమను టార్గెట్ చేసిందని కూడా దినకరణ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక కేసుల చట్రంలో చిక్కుకున్న దినకరన్ ఎక్కడికి పారిపోకుండా కూడా పోలీసులు అప్రమత్తం అయ్యారు. దేశం విడిచి పారిపోయే అవకాశాలు ఉన్నాయంటున్న ఢిల్లీ క్రైమ్ పోలీసులు, ఆ అవకాశం ఇవ్వకుంా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని విమానాశ్రయాలకు నోటీసులు కూడా అందించారు, కాగా దినకరణ్ ను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు వున్నాయిని వార్తలు వినపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ నుంచి తమ కుటుంబాన్ని బహిష్కరించారని తెలసిస దినకరణ్ తమను బహిష్కరించే అధికారం అన్నాడీఎంకే నేతలకు లేదని ప్రకటించారు.

ఇప్పటికీ పార్టీలోని ఎమ్మెల్యేనంలా తమ వెంటే వున్నారని చెప్పారు. తమను కాదని పార్టీలో ఏదైనా జరిగితే తక్షణం ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హెచ్చరించారు. తాజా ఘటనల నేపథ్యంలో అన్నాడీఎంకేలో వివిధ వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమైంది. మన్నార్ గుడి మాఫియా వర్గం ఇంకా శశికళకు మద్దతుగానే ఉందని, పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని తమిళనాడులో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : palani swamy  panner selvam  shasikala  aiadmk  Tamilnadu  

Other Articles