బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన నేత, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, వివిధ అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా రెండు వర్గాలు కలిసిపోయి తమిళనాడులో అధికారం చేపట్టాలని అమిత్ షా సూచించినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అన్నాడీఎంకే గుర్తు ‘రెండాకులు’ కూడా తిరిగి వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భవిష్యత్ తమిళనాడు రాజకీయాలు అమిత్ షా కనుసన్నల్లో సాగుతాయా? అన్న అనుమానం రేకెత్తుతోంది. ఇద్దరూ కలిసి వస్తే భవిష్యత్తులో కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా తాము చెప్పినట్టు నడుచుకుంటే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఒక మంత్రి పదవితో పాటు రెండు సహాయ మంత్రి పదవులు కూడా ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇందుకు ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని, 2019 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ చెరి సగం స్థానాల్లో పోటీ చేయాలని షరతులు విధించినట్టు తెలుస్తోంది. దీనికి సిద్ధంగా ఉంటే కేంద్రం నుంచి తమిళనాడుకు అన్ని విధాలుగా సాయం చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం వారిద్దరూ అమిత్ షా ‘ఆశీర్వాదం’ తీసుకుని బయటకు వచ్చిన తరువాతే రెండు వర్గాల మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభమైందని తెలుస్తోంది. కాగా, తమిళనాడులో చాలామంది తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, బీజేపీతో మైత్రికి వివిధ పార్టీలు ఆసక్తిగా ఉన్నాయని, ఆ రాష్ట్ర బీజేపీ ఇన్చార్జి మురళీధర్ రావు అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more