ప్రేమజంటపై గ్రామపెద్దలు దాష్టికం.. నగ్న ఊరేగింపు couple paraded naked in Rajasthan village

Couple paraded naked in rajasthan village video goes viral

Rajasthan couple paraded, Rajasthan couple paraded naked, Rajasthan couple beaten, Rajasthan couple assaulted, Rajasthan woman sexually assaulted, Rajasthan, Shambhupura village, Banswara, rajasthan

A young man and a woman were mercilessly beaten and tortured and paraded naked in a Rajasthan village because they had eloped. The 20-year-old woman was sexually assaulted and brutalised with a stick.

ITEMVIDEOS: ప్రేమజంటపై గ్రామపెద్దలు దాష్టికం.. నగ్న ఊరేగింపు

Posted: 04/20/2017 04:24 PM IST
Couple paraded naked in rajasthan village video goes viral

వయస్సు చేసింది తప్పిదం.. ఇద్దరు యుక్తవయస్సులో వుండటంతో ఒకొరినోకరు ఇష్టపడటం వారి పాలిట శాపంగా మారింది. ఇక పెద్దలు తమ పెళ్లిని అంగీకరించరని తెలుసుకుని గ్రామం, మండలమే కాదు ఏకంగా రాష్ట్రం దాటి వెళ్లినా.. వారిని వదిలిపెట్టలేదు గ్రామస్థులు. తప్పించుకుని వారి మానన బతుకుతున్న వారిని పట్టుకుని గ్రామానికి తీసుకువచ్చి.. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరించారు గ్రామసెద్దలు. అత్యంత దారుణమైన శిక్షలు విధించారు. వారిని ఇష్టానుసారం చితకబాది తమ అహాన్ని చల్లార్చుకున్నారు.

ప్రేమించడమే వారు చేసిన నేరం.. ఒకరినోకరు ఇష్టపడలమే వారు చేసిన పాపం.. అందుకు ఆ యువ జంటను గ్రామ వీదుల్లో నగ్నంగా ఊరేగించారు. వారిపై అలా శిక్ష విధిస్తున్న క్రమంలో కొందరు యువకులు వారిని తమ సెల్ ఫోన్లలో బంధించారు. అంతటితో అగకుండా దానిని సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా వైరల్ అయిన వీడియోలు.. అటు రాజస్థాన్ పోలీసులకు కూడా సవాల్ విసిరాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువజంటను గ్రామపెద్దల కబంధ హస్తాటు, కట్టుబాట్ల నుంచి విడిపించి.. అస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

వివరా్లలోకి వెళ్తే రాజస్థాన్ లోని బాన్స్ వారా జిల్లా శంబుపుర గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన యువతీ యువకులు ప్రేమించుకున్నారు. గ్రామ పెద్దలు తమ వివాహానికి అంగీకరించని ముందుగానే పసిగట్టిన ప్రేమజంట 25 రోజుల క్రితం గుజరాత్ కు పారిపోయారు. అక్కడే పెళ్లి చేసుకుని ఇద్దరు ఒక్కటయ్యారు. దీంతో వారి కోసం వెతికిన కుటుంబాలు, గ్రామ పెద్దలు చివరాఖన వారి జాగ కనుగొని ఈ నెల 16న వారిని గ్రామానికి తీసుకువచ్చాయి.

వారిద్దరూ వరుసగా అన్నా చెల్లెలు అవుతారన్న కారణంగా వారిని నగ్నంగా చేసి చితకబాదుతూ గ్రామ వీధుల్లో తిప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇలాంటిదే ఒక ఘటన సరిగ్గా గత ఏడాది జూన్ లో రాజస్థాన్ లోని గిరిజన ప్రాంతంలో జరిగింది. గ్రామపెద్దల అరాచకాలు వెలుగు చూడటంతో మానవసంఘాలు కూడా వారి దారుణాలను తీవ్రంగా ఖండిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lovers  striped naked  beaten  sexually assulted  Shambhupura village  Banswara  rajasthan  

Other Articles