Sasikala Threatens to Commit Suicide If Jayalalithaa Death Probed ఆత్మహత్య చేసుకుంటానని శశికళ బెదిరింపులు.. ఎందుకు.?

Sasikala threatens to commit suicide if jayalalithaa death probed

VK Sasikala threatens suicide, sasikala threats suicide if jaya death probed, sasikala threats suicide if jaya death photos released, sasikala threats suicide if jaya death videos leaked, AIADMK, jayanand diwakaran, palanisamy, ttv dinakaran, panneer selvam, tamilnadu

Sasikala's nephew Jayanand Diwakaran reportedly divulged that before going to Bengaluru jail, Sasikala warned him of committing suicide if the photos or videos of Jaya's last days from hospital comes out

ఆత్మహత్య చేసుకుంటానని శశికళ బెదిరింపులు.. ఎందుకు.?

Posted: 04/23/2017 09:08 AM IST
Sasikala threatens to commit suicide if jayalalithaa death probed

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో అక్కడ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కేంద్రం తీసుకున్న చర్యలతో వీలినాన్ని వీడిపోతున్న అన్నాడీఎంకే పక్షాలు.. మళ్లీ వెనక్కుతగ్గాయి. వీలినం దిశగా మళ్లీ చేతులు కలిపాయి. అయితే వీరి మధ్య మరోమారు విభేదాలు తలెత్తిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మరోమారు అధికార పళనిస్వామి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసుపై సీబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు పన్నిరు సెల్వం మరోమారు డిమాండ్ చేసిన నేపథ్యంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. అమ్మ తరువాత చిన్నమ్మగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తమిళప్రజలకు చేరువైన శశికళ.. ఏకంగా అత్మహత్య చేసుకుంటున్నారన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం చేసింది. అయితే ఈ మేరకు అమె ఎప్పుడు హెచ్చరికలు చేశారన్న విషయాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లే ముందు అమె ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ఆమె మేనల్లుడు జయానంద్ దివాకరన్ పేర్కొన్నారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న జయలలిత ఫొటోలు కానీ వీడియోలు కానీ బయటపెడితే తాను ఆత్మహత్య చేసుకుంటానని శశికళ హెచ్చరించారని దివాకరన్ తెలిపారు. ఈ మేరకు కుటుంబ సభ్యులను హెచ్చరించి మరీ ఆమె జైలుకు వెళ్లారని వివరించారు. జయలలిత ఫొటోలు బయటకు వచ్చినా, ఆమె అంతిమ ఘడియల ముందు ఆస్పత్రిలో జరిగిన వ్యవహారం బయటకు పొక్కినా, జయ మరణంపై విచారణ జరిపినా తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారని దివాకరన్ పేర్కొన్నారు. దివాకరన్ తాజా వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో మరోమారు కలకలం రేగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles