Jio free offers to continue for 12-18 months మరో ఏడాది పాటు జియో ఆఫర్.. ప్రత్యర్థులు చిత్తు..

Reliance jio free offers to continue for 12 18 months

Reliance Jio, Reliance Jio free offers, Reliance Jio offers, Reliance Jio data plan, Reliance Jio free data, Reliance Jio Prime users, Reliance Jio non prime users, Airtel, Vodafone, Idea , No end to data wars: Reliance Jio free offers to continue for 12-18 months, business news, India news

The free schemes and recharge options that Reliance Jio is offering to its customers is likely to continue for the next 12-18 months

మరో ఏడాది పాటు జియో ఆఫర్.. ప్రత్యర్థులు చిత్తు..

Posted: 04/26/2017 05:12 PM IST
Reliance jio free offers to continue for 12 18 months

జియో వినియోగదారులకు త్వరలో మరో మంచి శుభవార్తను అందించేందుకు రిలయన్స్ సిద్దమవుతుంది. టెలీకమ్యూనికేషన్ రంగంలో అరంగ్రేటంతోనే ప్రత్యర్థులను చిత్తు చేసిన రిలయన్స్ జియో.. తన వ్యాపార ప్రత్యర్థులను కోలుకోని దెబ్బతీసింది. దీంతో పాటు ఇతర టెలికాం సంస్థల్లో ఉపాధిని అర్జిస్తున్న అనేక మంది ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చివేసిందన్న విమర్శలను కూడా మూటగట్టుకుంది. అయితే ఇన్నాళ్లు ఇతర టెలికాం సంస్థలు కస్టమర్ల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసిన అధిక లాభాలను జియో అరంగ్రేటంతో బయటపడ్డాయన్న వాదనలు సైతం వినిపిస్తున్నాయి.

జియో రాకతో ఇప్పుడు టెలికమ్యూకేషన్ రంగంలో జియోకు ముందు.. జియోకు తరువాత అన్న విభజన స్పష్టంగా కనిపిస్తుందని కూడా కస్టమర్లు చెబుతున్నారు. అందులోనూ డాటాను వినియోగిస్తున్న వినియోగదారులు ఈ విభజనపై మరీ ముఖ్యంగా చర్చించుకునే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని అంటున్నారు. ఎవరు ఏమనుకున్నా రిలయన్స్ యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అవిర్భావ అఫర్ తరువాత హ్యాపీ న్యూఇయర్ అపర్ తో వచ్చిన జియో.. ఇక తాజాగా ధన ధనా ధన్ అఫర్ తో కస్టమర్ల ముందుకు వచ్చిన విషయం విధితమే.

కాగా ధన్ ధనా ధన్ అపర్ ను మూడు నెలల కాలం నుంచి పోడిగించే అవకాశాలను కూడా రిలయన్స్ జియో యాసమాన్యం పరిశీలిస్తున్నట్లు సమాచారం. జియో అందిస్తున్న ఫ్రీ ఆఫర్లు, డిస్కౌంట్ ఆఫర్లు మరో ఏడాది నుంచి 18 నెలల వరకు కొనసాగిస్తూనే ఉంటారని సమాచారం. అయితే ఇప్పటికే ట్రాయ్ నుంచి అక్షింతలు పడిన జియో ఇకపై ఎలా ఈ అపర్లును పొడగిస్తుందన్న విషయం కూడా వేచి చూడాల్సిందే. ఇప్పటికే జియో దెబ్బకు ఐడియా, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్, ఎయిర్ టెల్ లాంటి దిగ్గజ టెలికాం సంస్థలు కుదేలయ్యాయి.

జియోకు పోటీగా రావాలని, కస్టమర్లను చేజార్చుకోకూడదని భావిస్తున్న సంస్థలు కూడా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు డాటాను కూడా ఉచితంగా అందించే ఆఫర్లతో ముందుకు వచ్చాయి. అయితే జియో మరో ఏడాది నుంచి ఏడాదిన్నర పాటు ఆపర్లను కొనసాగించాలని భావిస్తున్న తరుణంలో ఇది ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్న వ్యవహారం. అయితే జియో ఇలా అఫర్లను కొనసాగిస్తున్న క్రమంలో పోటీ టెలికాం సంస్థలు కూడా ఆ మార్గాన్ని గత్యంతరం లేని పరిస్థితులలో అనుసరించాల్సి వస్తుందని తెలిపారు.

అయితే, జియో ఆఫర్లను ఎక్కువ కాలం కొనసాగించడం సాధ్యమయ్యే పని కాదని భావిస్తున్న ప్రత్యర్థి కంపెనీలు.. ఇక తమ బాటలో తాము పయనించే మార్గాలను అన్వేషిస్తున్నాయి. అర్థికభారం విపరీతంగా పడుతున్న తరుణంలో ప్రత్యర్థి సంస్థలు ట్రాయ్ ను అశ్రయించే అవకాశాలు కూడా లేకపోలేదు. కాగా, జియో మాత్రం అర్థిక అంశంతో ముడిపడిన ఆపర్ల పోడగింపును తనకు అనుకూలంగా మలచుకునే పనిలో ఉంది. మరో సంవత్సర కాలం పాటు ఈ ఆఫర్లను ఏ ఇతర కంపెనీ భరించదని తెలిసి.. ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇదే నిజమైతే... జియో వినియోగదారులకు మరో ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance Jio  free offers  Jio Prime users  non prime users  Airtel  Vodafone  Idea  

Other Articles