తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మృతిపై విచారణ.. ఇది పన్నీర్ సెల్వం చేస్తున్న ప్రధాన డిమాండ్. అయితే ఆ విషయంలో ఎందుకనో పళనీ వర్గం వెనకంజ వేస్తుంది. శశికళ అండ్ కో ను పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ వేద నిలయంలో ఏం జరిగింది? ఆమె చికిత్స విషయం ఎందుకు దాస్తున్నారన్నది పరిశీలిస్తే తెరవెనుక ఏదో పెద్ద మతలబే ఉండి ఉంటుదన్నది అర్థమైపోతుంది. ఇదిలా ఉంటే అమ్మ చనిపోయిన సమయంలో మెరీనా బీచ్ వద్దే ఆత్మగా మారి తిరుగుతుందని ఓ వార్త అప్పట్లో కలకలమే రేపింది.
తమను విడిచి వెళ్లటం ఇష్టం లేకనే ఉండిపోయిందని కొందరు, తమిళ రాజకీయాల కల్లోలం భరించలేకే ఆత్మ క్షోభించి ఇక్కడే ఉండిపోయిందని ఇంకొందరు చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే ఆమె ఇల్లు వేద నిలయానికి సంబంధించిన ఒక సంచలన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమ్మ ఆత్మ దెయ్యమై వేద నిలయంలో తిరుగుతోందన్న ప్రచారం రోజు రోజుకి పెరుగుతోంది. రాత్రి అయితే చాలు.. వేద నిలయంలో అరుపులు, కేకలతో దద్దరిల్లుతోందన్న ప్రచారం అంతకంతకూ పెరుగుతోంది. వేద నిలయం నుంచి వస్తున్న శబ్దాలతో చుట్టుపక్కలవారు భయభ్రాంతులకు గురి అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
అమ్మ మరణం తర్వాత.. ఆమె నెచ్చెలి శశికళ వేద నిలయంలోనే ఉండటం.. ఆమె పుణ్యమా అని మన్నార్ గుడి మాఫియా అమ్మకు ఇష్టమైన ఇంట్లో తిష్ట వేశారు. అక్రమాస్తుల కేసులో ఎప్పుడైతే చిన్నమ్మ, ఆపై ఈసీ లంచం కేసులో దినకరన్ జైలుకు వెళ్లారు. ఇక వారిని తరిమేసిన అమ్మ నచ్చని వారు వేదనిలయం వైపు వెళితే చాలు.. పెద్దపెద్దగా శబ్దాలు చేస్తూ హడలెత్తిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇదంతా కావాలని చేస్తున్న ప్రచారమని.. శశికళ తరఫు వారు వేద నిలయాన్ని తమ సొంతం చేసుకోవటానికి ఆడుతున్న డ్రామాగా పలువురు చెబుతున్నారు. అధికారులు వేద నిలయంలోకి అడుగుపెట్టటానికి సైతం భయపడేలా చేయటం కోసమే చిన్నమ్మ వర్గమే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ఒకప్పుడు అమ్మ, అనుచరులతో కళకళలాడిన వేదనిలయం, ఇప్పుడు దెయ్యం ప్రచారంతో భవిష్యత్తులో బూజు బంగ్లాగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more