Telangana Police file case against Digvijay Singh దిగ్విజయ్ పై కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు

Telangana police file case against digvijay singh over controversial comments

case against Digvijay Singh, Telangana Police file case against Digvijay, digvijay accuses telangana police, Digvijay Singh controversial comments, K Chandrasekhar Rao, Digvijaya Singh, KT Rama Rao, DGP Anurag Sharma, ISIS, muslim youth, Telangana Police

Telangana Police has filed a case against Congress senior leader Digvijay Singh over his controversial comments and tweets on the government and Chief Minister K Chandrasekhar Rao.

డిగ్గీరాజాపై కేసు.. ఆధారాలున్నాయంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత

Posted: 05/04/2017 03:03 PM IST
Telangana police file case against digvijay singh over controversial comments

కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ పై హైదరాబాద్  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యల చేసిన దిగ్విజయ్ పై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయనిపుణుల సలహా తీసుకున్న పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు. తెలంగాణ పోలీసులే ముస్లిం యువతను తీవ్రవాదం బాటపట్టేలా రెచ్చగొడుతున్నారంటూ దిగ్విజయ్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారి తీవ్ర కలకల రేపిన విషయం తెలిసిందే.

పెను దుమారాన్ని రేపిన దిగ్విజయ్ వ్యాఖ్యలను ఇటు తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు, పోలీసులతో పాటు బీజేపీ అగ్రనేతలు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ తీవ్రంగా ఖండించారు. అయినా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి వున్నానని దిగ్విజయ్ పునరుద్ఘాటించారు. పోలీసులు యువతను తీవ్రవాదం వైపు మళ్లేలా రెచ్చగొడుతున్నారనడానికి ఆధారాలు బయటపెట్టాలని తెలంగాణ టీఆర్ఎస్, బీజేపి నేతలు డిమాండ్ చేశారు.

అయితే కేసు నమోదైన తరువాత ఈ విషయమై స్పందించిన దిగ్విజయ్.. కేసీఆర్ ప్రభుత్వం తనపై కేసు నమోదు చేయాడాన్ని స్వాగతిస్తునన్నానని చెప్పారు. ఏ రోజు ఎక్కడకి విచారణకు రావాలో చెబితే అక్కడకు వస్తానని కూడా చెప్పారు. తన వ్యాఖ్యలతో తెలంగాణ పోలీసుల ప్రతిష్ట దిగజార్చాయని కేసీఆర్ ప్రభుత్వం, బీజేపి నేతలు చేస్తున్న వాదనల్లో పసలేదని తోసిపుచ్చిన ఆయన.. వాస్తవానికి తన వ్యాఖ్యలు తెలంగాణ పోలీసులు ప్రతిష్టను పెంచాయని చెప్పారు. ఇక తాను చేసిన వ్యాక్యలకు ఇంకా తాను కట్టబడి వున్నట్లు చెప్పిన డిగ్గీరాజా.. తన వద్ద అందుకు సంబంధించిన ఆధారాలు వున్నాయని కూడా తేల్చిచెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles