మహారాష్ట్రంలోని బీడ్ జిల్లాలో ప్రమాదానికి గురై అసప్మారక స్థితిలోకి జారుకున్న బైకిస్టు అకస్మాత్తుగా మంటలంటుకుని సజీవదహనం అవుతున్నా.. ఆ ఘటనను చూస్తూ వెళ్లిపోతున్న వాహనదారులు కనీసం తమ వాహనాలను అపడానికి కూడా విముఖత వ్యక్తం చేశారు. ఇక కొందరు అక్కడికి వచ్చినా అతన్ని అదుకునే చర్యలకు పూనుకోకుండా.. సెల్పీలు, ఫోటోలు, వీడియోలకు మాత్రమే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ అదే చైనాలోని ఇందుకు పూర్తి భిన్నంగా ఘటన చోటుచేసుకుంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ బైకిస్టు ప్రాణాలను కాపాడారు.
సజీవదహనం అయ్యే వ్యక్తిని క్షణాల్లో స్పందించిన ట్రక్కు డ్రైవర్ సహా అందులోని వ్యక్తి కాపాడారు. తమ వాహనాన్ని వచ్చి ఢీకొన్న వ్యక్తికి గాయాలైతే.. వాడిపై విరుచుకుపడే వ్యక్తులను మనం నిత్యం చూస్తుంటాం. కానీ అలా కాకుండా మానవత్వం పరమళించిన ట్రక్కు డ్రైవర్ తమ ప్రాణాలను కాపాడుకున్న తరువాత.. వెంటనే స్పందించి మంటల్లో చిక్కుకున్న బైకిస్టు ప్రాణాలను కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ ఘటన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్తా వైరల్ గా మారింది. ఏకంగా లక్షల మంది ఇప్పటికే దీనిని వీక్షించారు.
వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్ నాన్చాంగ్లో ఓ కూడలి వద్ద రోడ్డుపై నుంచి మెల్లిగా వెళుతున్న ఓ ట్రక్‌ను బైక్‌పై వేగంగా వచ్చిన ఓ వ్యక్తి అదుపు తప్పి ఢీకొన్నాడు. బైక్ నేరుగా ట్రక్కుకు దిగువభాగంలో ఉన్న ఆయిల్ ట్యాంక్‌కు గట్టిగా తగలడంతో వెంటనే మంటలు అంటుకున్నాయి. దీనిని గమనించిన ట్రక్కులోని డ్రైవర్ సహా మిగిలిన వ్యక్తులు. హుటాహుటిన ట్రక్కు దిగిపోయారు. ప్రమాదానికి గురైన బైకిస్టు కూడా ఆ మంటల్లో చిక్కుకున్నాడు. దీంతో ట్రక్కు డ్రైవర్ తన ప్రాణాలను పనంగా పెట్టి.. బైకిస్టును మంటల నుంచి పక్కకు తీసుకువచ్చాడు. అతడ్ని అంటుకున్న మంటలను అర్పేశాడు. ఇంతలో మంటలు తీవ్రస్థాయికి చేరుకోగా, బైకిస్టును అక్కడి నుంచి శ్రమపడి రోడ్డు పక్కకు తీసుకువచ్చేందుకు త్రీవంగా కష్టపడ్డాడు. ఈ కష్టం ఎలా వుందో మీరే చూడండీ..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more