hyderabad mla lands in trouble after controversial remarks వివాదాస్పద హైదరాబాద్ ఎమ్మెల్యేకు ఇలా చెక్ పెట్టారా..!

Hyderabad mla lands in trouble after controversial remarks

police files case against mla raja singh, police case on mla raja singh, case on gioshamahal mla raja singh, hyderabad mla, controversial remarks, raja singh, goshamahal, controversial remarks, police, case, hyderabad mla

hyderabad gosha mahal bjp mla raja singh lands in trouble as police files case agains him after he made controversial remarks

వివాదాస్పద హైదరాబాద్ ఎమ్మెల్యేకు ఇలా చెక్ పెట్టారా..!

Posted: 05/14/2017 10:41 AM IST
Hyderabad mla lands in trouble after controversial remarks

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే చిక్కుల్లో చిక్కుకున్నారు. అయితే తన పార్టీ వారు చేశారా.. లేక ప్రత్యర్థి పార్టీ వారు చేశారో తెలియదు కానీ మొత్తానికి ఆయనకు అలా చెక్ పెట్టేశారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు.. బీజేపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సంచలన అరోపణలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హైదరాబాద్ లోని గోషా మహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. ఇటీవల తాను చేసిన సంచలన వ్యాఖ్యల కారణంగా కేసుల్లో చిక్కుకున్నారు.

ఓల్డ్ సిటీని మినీ పాకిస్థాన్ గా అభివర్ణించడంతో కష్టాలు కొనితెచ్చుకున్నారాయన. ఇక గో హత్యకు పాల్పడేవారిని ఉపేక్షించమని చెప్పిన ఆయన. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను తాము చంపేస్తామని కూడా అన్నారు. రాజ్యాంగం చట్టాల కంటే తనకు మత ధర్మమే ముఖ్యమని చెప్పిన నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణకు ప్రైవేటు సైన్యం తయారుచేస్తున్నట్లు కూడా చెప్పారు.    

ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు అయనపై కేసు నమోదు చేశారు. రాజాసింగ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా వున్నాయని పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించేలా రాజాసింగ్ వ్యాఖ్యానించారంటూ అభియోగాలు నమోదు చేసిన పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. మరోవైపు ఇలాటి ఆరోపణలతోనే దారాస్గా జిహాద్ ఓ షాదత్ నేత మహ్మాద్ అబ్దుల్ మాజిద్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raja singh  goshamahal  controversial remarks  police  case  hyderabad mla  

Other Articles