Separate 'South Telangana' Movement Soon! మరో ఉద్యమానికి వేదిక కానున్న తెలంగాణ..?

Telangana to be venue for another seperate movement

another seperate telangana movement, separate South Telangana movement, another telangana movement, Telangana, South Telangana, TRS, Nalgonda, Khammam, Mahbubnagar. Rangareddy. congress, Gandhi Bhavan

After the Telangana movement, it seems another movement for separate South Telangana state may take off soon.

మరో ఉద్యమానికి వేదిక కానున్న తెలంగాణ..?

Posted: 05/14/2017 01:49 PM IST
Telangana to be venue for another seperate movement

రాష్ట్ర పునర్విభజన కోసం ఉద్యమించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ గడ్డ, మరో ఉద్యమానికి కూడా వేదిక కానుందా.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అధికారపక్షం తమ ప్రాంతంపై శీతకన్ను వేసిందని అందకనే తమను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకురానున్నారు నేతలు. తెలంగాణలో మరో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం మొదలవబోతోంది.  దక్షిణ తెలంగాణపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆయన తీరు కారణంగా దక్షిణ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం వస్తుందని అంటున్నారు.  

ఇదే వివక్ష కొనసాగితే ఉద్యమం తప్పదని కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్రెడ్డి తాజాగా బాంబు పేల్చారు. మహబూబ్నగర్ జిల్లా నేతలతో వంశీకృష్ణ భేటీ అయి ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయన మహబూబ్ నగర్ కు చెందిన పలు సమస్యలపైనా గళమెత్తుతున్నారు. డిండి పాలమూరు ప్రాజెక్టులను అనుసంధానం చేస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. అదే జరిగితే పాలమూరు నల్లగొండ రంగారెడ్డి జిల్లాల ప్రజలు కొట్టుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ తీరుతో భవిష్యత్తులో జలయుద్ధం వచ్చే ప్రమాదం ఉందన్నారు.     

టీఆర్ఎస్ ది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్న వంశీచంద్రెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఖరీప్ సీజన్ కు నీరు అందించకపోతే ఉద్యమం ద్వారా సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా దక్షిణ తెలంగాణపై వివక్ష చూపుతున్నారని గతంలో పలువురు ఇతర నేతలూ గళమెత్తిన సందర్భాలుండడంతో వారందరినీ ఏకం చేస్తారా లేదంటే... ఇవన్నీ ఉత్తుత్తి మాటలేనా అన్నది చూడాలి. ఇక ప్రస్తుతం కేంద్రంలో వున్న బీజేపి చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకమన్న సంకేతాలను ఇప్పటికే ఇచ్చిన నేపథ్యంలో ఉద్యమం ఎలా ఊపందుకుంటుందో వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  South Telangana  TRS  Nalgonda  Khammam  Mahbubnagar. Rangareddy. congress  Gandhi Bhavan  

Other Articles