IMD issues heatwave warning for telugu states మాడు పగలగొడుతున్న ప్రచండుడు.. మరో రెండ్రోజులు హెచ్చరికలు..

Imd issues another two day heatwave warning for telugu states

Heat wave, Telangana, Andhra Pradesh, costal district, weather, ​high temperatures, Weather, Hot, Temperature, Dry Weather, Thunderstorm, Rainfall, Hot Weather, Summer, Meteorological Department, Adilabad, Mahbubnagar , Hyderabad, Cyclonic storm

The Indian Meteorological Department (IMD) has issued a two-day heat wave warning for all districts of Telangana state and coastal Andhra Pradesh.

మాడు పగలగొడుతున్న ప్రచండుడు.. మరో రెండ్రోజులు హెచ్చరికలు..

Posted: 05/16/2017 02:27 PM IST
Imd issues another two day heatwave warning for telugu states

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రచంఢుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. తెలుగు రాష్ట్రాల ప్రజలను భానుడి భగభగలు హడలెత్తిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సారి గరిష్టంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత గుంటూరు జిల్లాలో నమోదు కావడం అక్కడి పరిస్థితిని తెలియజేస్తుంది. ఎండలతో గుంటూరు ప్రాంతమంతా అగ్నిగుండాన్ని తలపిస్తుంది. కాగా, విజయవాడలో 46 డిడ్రీలు నమోదైంది. ఇటు తెలంగాణలోనూ ఎండలు ప్రజల మాడు పగలగొడుతున్నాయి. అదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎండ్రల తీవ్రత అధికంగా వుంది. ఈ మూడు జిల్లాలో గరిష్టంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రచండుడి ప్రతాపంతో నిప్పుల కొలిమిలా మారిన తెలుగు రాష్ట్రాలలో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. మరీ ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో గంట గంటలకు ఎండల తీవ్రత పెరుగుతున్నాయి. సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు తగ్గడం లేదు. అయితే రాత్రి పది గంటల తరువాతే కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదు అవుతాయిన భారత వాతవరణ శాఖ అధికారులు హెచ్చరలు జారీ చేశారు.

ధక్షిణ అండమాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఉత్తర అరేబియా సముద్రం వరకు 3.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల అవర్తనం అలుముకుందని.. దీని ప్రభావంతో ఉత్తరాధి నుంచి వేడి గాల్పులు వీస్తున్నాయని తెలిపారు. వేడి గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో అధిక ఉస్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. సముద్ర తీరం నుంచి వేడి గాలులు వీస్తుండటంతో కోస్తా తీరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపింది. నాలుగు రోజుల్లో ఏపీలోని ఎనిమిది జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నట్టు నాసా ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

రెండు రాష్ట్రాల్లో గరిష్టంగా నమోదైన ఉష్ణోగ‍్రతల వివరాలు

గుంటూరు -47 డిగ్రీలు
విజయవాడ-46 డిగ్రీలు
ఒంగోలు-45 డిగ్రీలు
ఏలూరు-45 డిగ్రీలు
నెల్లూరు-44 డిగ్రీలు
కాకినాడ-45 డిగ్రీలు

ఆదిలాబాద్‌-45
ఖమ్మం-45
నల్లగొండ-45
నిజామాబాద్‌-44
కరీంనగర్‌-44
వరంగల్‌-44
హైదరాబాద్‌-42

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles