అందరి తల్లిదండ్రుల మాదిరిగానే ఆ పెళ్లికోడుకు తల్లిదండ్రులు కూడా సంతోషంలో మునిగిపోయారు. మరికోద్దిసేపట్లో తమ కుమారుడి వివాహం జరుగుతుందన్న ఆనందంలో.. పెళ్లికి హాజరైన బంధుమిత్రులతో కలసి అంతా కోలాహలంగా ఉన్నారు. అప్పుడు సినీ పక్కీలో ఓ ఘటన జరిగింది. పాత చిత్రాలలో సరిగ్గా పెళ్లిలో తాళి కట్టే శుభసమయానికి బంధిపోటు దోంగలో, లేక ప్రియుడి తరపున హీరోనో ఇలా ఎంట్రీ ఇచ్చి పెళ్లికూతరుని అపహరించుకుపోయి వారికి కావాల్సిన వారితో వివాహం జరిపించేవారు. అయితే ఇందుకు భిన్నంగా వధువుకు బదులు వరుడ్ని కిడ్నాప్ చేసింది ఓ రివాల్వర్ రాణి.
సరిగ్గా పెళ్లి ముహూర్తం సమీపిస్తుంది అనగా, కల్యాణ మండపానికి ఓ స్కార్పియో దూసుకొచ్చింది. దానిలోంచి చేత రివాల్వర్ పట్టుకుని పాతికేళ్ల యువతి దిగి దిగడంతోనే వరుడి వద్దకు చేరకుని అతని తలకు నేరుగా గురిపెట్టి.. తనతో రాకపోతే కాల్చిచంపుతానని బెదిరించింది. అలా వరుడ్ని తనతో పాటు తీసుకెళ్లిపోయింది. ఆ సందర్బంగా వేదిక నుంచి పెళ్లికి వచ్చిన అహుతులకు ఓ విషయాన్ని చెప్పింది. ఈ పెళ్లికడుకు తనను ప్రేమించాడని, ఇప్పుడు మోసం చేయాలని చూస్తున్నడని.. మరో పెళ్లి చేసుకుంటే తనను మోసగించినట్లే కదా.. అయితే తాను దీనిని అడ్డుకుంటానని అందుకనే ఇక్కడకు వచ్చానని చెప్పింది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆమెతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా వాహనంలో వచ్చారని బంధువులు తెలిపారు. కాగా, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వరుడు అవోక్ యాదవ్ బండాలోని ఓ ప్రైవేటు క్లినిక్ లో కాంపౌండర్ గా పనిచేస్తున్నాడు. అక్కడే పని చేస్తున్న యువతితో ప్రేమలో పడ్డాడు. అ తరువాత అమెను వదిలించుకోవాలని చూశాడు. అమెతో కలసి తిరిగిన రోజుల్లో చేసిన బాసలు, తెలిపిన ఊసులు అన్ని మర్చిపోయాడు. గుట్టుచప్పుడు కాకుండా తన తల్లిదండ్రులు అమర్చిన వివాహాన్ని చేసుకునేందుకు సన్నధమయ్యాడు.
ఈ విషయాన్ని పరిచయస్తుల ద్వారా తెలసుకున్న యువతి అతడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. ఇంకేముందు వివాహ సమాయానికి వచ్చి వరుడ్ని కిడ్నాప్ చేసింది. అయితే, తన కుమారుడు నిర్వాకంపై తనకు అనుమానం వచ్చిందని, ఓ సారి బండాకు వెళ్లిన తనను ఇంటికి పిలవకుండా ఓ గుడిలో కలసి బయటే బోజనం పెట్టించి పంపాడని వరుడి తండ్రి రామ్హేత్ యాదవ్ వెల్లడించారు. తన కుమారుడు కిడ్నాప్ నకు గురయ్యాడన్న ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపిస్తామని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more