China Issues warning for new Ransomware Virus

China found new ransomware virus

UIWIX Virus, China New Virus, Wanna Cry Danger, China New Virus, Malware, Virus Attack

China warns of new ransomware virus. Chinese authorities have warned computer users of a new ransomware virus detected abroad. The National Computer Virus Emergency Response Center (CVERC) and software company AsiaInfo today detected the "UIWIX" virus, which is spreading in a way similar to the "WannaCry" ransomware.

వాన్నా క్రై కాదు.. అంతకు మించి

Posted: 05/18/2017 01:01 PM IST
China found new ransomware virus

వాన్నా క్రై దెబ్బకి ప్రపంచం అంతా వణికిపోతుంది.150కి పైగా దేశాల్లో లక్షల కంప్యూటర్లను పట్టి పీడిస్తున్న ఈ ర్యాన్సమ్ వేర్ వైరస్ కోసం ఇంకా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటిదాకా బ్లాక్ మెయిలింగ్ పేరిట హ్యాకర్లు 50,000 డాలర్ల దాకా సంపాదించినట్లు తెలుస్తోంది. అయితే అంతకు మించిన మరో ముప్పు మున్ముందు పొంచి ఉందని హెచ్చరిస్తోంది చైనా. వాన్నా క్రై కన్నా ప్రమాదకరమైన వైరస్ ను చైనా కనుగొన్నట్లు ప్రకటించింది ఇప్పుడు. అత్యాధునిక కంప్యూటర్లతోపాటు స్మార్ట్ ఫోన్లను పూర్తిగా నాశనం చేసే సామర్థ్యం ఉన్న వైరస్ గురించి వార్త రావటంతో కలవరపాటుకు గురిచేస్తోంది.

చైనాలోని జాతీయ కంప్యూటర్ వైరస్ అత్యవసర స్పందన కేంద్రం (సీబీఈఆర్సీ) ఓ ప్రకటన వెలువరుస్తూ.. షాడో బ్రోకర్లు ఎంఎస్17-010 గా దానికి పేరు పెట్టినట్లు తెలిపింది. ఈ వైరస్ సోకితే కంప్యూటర్లు పూర్తిగా స్తంభించి పోతాయని, వాన్నా క్రై కన్నా ఇది చాలా బలమైనది, ప్రమాదకరమైనదని హెచ్చరించింది. ఇక్కడో ట్విస్ట్ ఏంటంటే వాన్నా క్రై వచ్చిన అదే ఎస్ఎంబీ 'సర్వర్ మెసేజ్ బ్లాక్'నుంచే ఈ వైరస్ కూడా వ్యాప్తి చెందుతోందని నిపుణులు వెల్లడించారు.

సిస్టమ్స్ ను పట్టుకుని పీడించడంతో పాటు, దానితో అనుసంధానమైన నెట్ వర్క్ కంప్యూటర్లకు విస్తరిస్తుందని, తనంతట తానుగానే బాధితులను వెతుక్కుంటుందని తెలిపారు. ఏ విధమైన ఫైల్ రూపంలో లేకుండానే ఇది సోకుతుందని, కంప్యూటర్ డిస్క్ లలోకి చొరబడి పాతుకుపోతుందని సైబర్ నిపుణులు తెలిపారు. ఈ వైరస్ కోడ్ స్ట్రింగ్స్ ప్రకారం, ఇది సోకితే బ్రౌజర్ లాగిన్స్ అన్నీ స్తంభించిపోతాయని, ఎఫ్టీపీ (ఫైల్ ట్రాన్స్ ఫర్ ప్రొటోకాల్), ఈమెయిల్, మెసింజర్ వంటి వాటితో పాటు డేటాపైనా ప్రభావం పడుతుందని తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyber Attack  China  New malware  

Other Articles