అంతర్జాలం అందుబాటులోకి వచ్చిన తరువాత సెలబ్రిటీలకు మరీ కష్టాలు ఎక్కవయ్యాయి. మరీ ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలతో పాటు యువతులకు ఈ బెడత తప్పడం లేదు. ఇన్నాళ్లు తమ మార్ఫడ్ చిత్రాలను ఫోటోషాఫ్ చేసి అశ్లీల చిత్రాలుగా మారుస్తూ వాటిని నెట్ లో పెడుతున్నారంటూ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు పోలీసులకు పిర్యాదు చేయగా, తాజాగా అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప కూడా ఈ విషయమై పోలీసులను అశ్రయించారు. అమె ఫోటోలు, పోస్టులు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి.
తమళినాడులో ఇద్దరు యువతులు ఈ మార్ఫింగ్ ఫోటోల వల్ల బలవన్మరణాలకు పాల్పడినా.. ఇంకా అగంతకులకు కనువిప్పు కలగలేదు. కొందరు అగంతకులు ఇదే పనిగా సెలబ్రీటీల చిత్రాలను మార్ఫింగ్ చేస్తూ నెట్ లో పోస్టు చేస్తుండగా, మరికొందరు మాత్రం తమను ప్రేమించేందుకు నిరాకరించిన అమ్మాయిలను, లేదా తమను వివాహం చేసుకునేందుకు అయిష్టత వ్యక్తం చేసిన యువతుల చిత్రాలను మార్ఫింగ్ చేసి మరీ పనెట్ లో పెడుతున్నారు. అంతటితో అగకుండా వారి స్నేహితులకు కూడా మార్ఫింగ్ చిత్రాలను పంపుతున్నారు. దీంతో తమ పరువు పోయిందని భావించిన యువతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలా ఇప్పటికే ఇద్దరు యువతలు తమిళనాడులో అసువులు బాశారు. అయినా అగంతకులు నిసిగ్గుగా వ్యవహరిస్తూ.. అవే పనులకు పాల్పడుతున్నారు. తాగాజా వీరి బారిన ఎంపీ శశికళ పుష్ఫ కూడా పడ్డారు.
దీంతో తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ తనను టార్గెట్ చేస్తున్నారని... తన పరువు మర్యాదలకు భంగం కలింగించే రీతిలో కొందరు అగంతకులు వ్యవహరిస్తున్నారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఐఏడీఎంకే అమ్మా పార్టీకి చెందిన కొందరు నేతలే తనను కావాలని టార్గెట్ చేస్తూ..ఈ దారుణానికి ఒడిగడుతున్నారని అమె దేశరాజధాని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశామని... సైబర్ సెల్ దీనిపై దర్యాప్తు చేస్తుందని క్రైం విభాగం డీసీపీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more