Gottipati versus Karanam TDP Group Clash take New Turn

Gottipati ravi kumar vs karanam balaram

TDP Group Politics, Prakasham TDP Politics, Karanam Gottipati, Gottipati Murders, Murder Politics in TDP, TDP Group Clashes, Gottipati Karanam Clash, Karanam Venkatesh Gottipati, Gottipati Karanam Chandrababu, Chandrababu Prakasham Politics, Gottipati on Rumours

TDP Prakasham Group Politics: Gottipati Ravi Kumar versus Karanam Balaram. Two Killed in Group Clash War of Words.

కరణం వర్సెస్ గొట్టిపాటి.. అసలేం జరుగుతోంది?

Posted: 05/20/2017 12:16 PM IST
Gottipati ravi kumar vs karanam balaram

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ వర్గ పోరు తారా స్థాయికి చేరుకుంది. మీడియా సాక్షిగానే బహిరంగంగా తీవ్ర విమర్శలు, సవాళ్లు చేసుకుంటున్నారు ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో ఫ్యాక్షన్ కక్ష్యలతో తమ తరపు ఇద్దరు కార్యకర్తలను నరికి చంపటంపై కరణం వర్గీయులు రగిలిపోతున్నారు. కోవర్ట్ రాజకీయాలతో హత్యాకాండకు గొట్టిపాటి తెరలేపాడని ఆరోపిస్తున్నారు.

గొట్టిపాటి ఓ క్రిమినల్. నిజం చెప్పే అలవాటు ఆయనకు లేదు. 'సొంత అన్నపైనే పోటీ చేసిన సన్నాసి' అంటూ కరణం ఒకానోక స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సిద్ధాంతాలు లేని వ్యక్తి కావటంతో కక్కుర్తి పనులు చేస్తాడని మండిపడ్డాడు. ఉన్నతాధికారుల సహాయంతో నియోజకవర్గానికి మేలు చేయడం మాత్రమే తనకు తెలుసని... గొట్టిపాటిలా నీచమైన రాజకీయాలు చేయడం తనకు తెలియదని చెప్పాడు.ఇంట్లో నే తగాదాలు వచ్చేలా చేసిన నీచుడు గొట్టిపాటి అని ధ్వజమెత్తాడు.

ఇక కరణం బలరాం తనయుడు వెంకటేష్ కూడా గొట్టిపాటిపై ఓ రేంజ్ లో ఫైరయ్యాడు. గతంలో వైసీపీ కార్యకర్తలను మోసం చేశాడని... ఇప్పుడు టీడీపీలోకి వచ్చి 95 వేల మంది కార్యకర్తలను మోసం చేయాలని చూస్తున్నాడంటూ గొట్టిపాటిపై విరుచుకుపడ్డాడు. కేవలం స్వలాభం కోసమే గొట్టిపాటి రవి టీడీపీలో చేరారని మండిపడ్డాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాట రాకూడదనే కారణంతోనే తాము ఓపికపడుతున్నామని... లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదన్నాడు. టీడీపీని నమ్ముకునే వేలాది మంది తమకు ఓటు వేశారని అన్నారు. కార్యకర్తలకు మేలు జరగాలనేదే తమ లక్ష్యమని చెప్పారు.'దమ్ము, ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం.. రా' అంటూ గొట్టిపాటికి సవాల్ విసిరాడు.

 

నాకేం సంబంధం లేదు:గొట్టిపాటి

తనపై వస్తున్న ఆరోపణలను గొట్టిపాటి ఖండించాడు. ఇప్పటి దాకా మూడుసార్లు తాను ఎమ్మెల్యే అయ్యాయని... ఇలాంటి హత్యారాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం తనకు గాని, తన కుటుంబానికి కాని ఎప్పుడూ లేదని అన్నారు. గ్రామంలో జరిగిన ఘటనతో తాము కూడా చాలా బాధగా ఉన్నామని... కొత్తగా టీడీపీలోకి వచ్చిన తాము అందరినీ కలుపుకుని పోయే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు.

గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడులను తీసుకొచ్చి తమ మీద రుద్దడం మంచి పద్ధతి కాదని అన్నారు. తాము మర్డర్లు చేస్తామా? లేదా? అనే విషయం అందరికి తెలిసిందేనని... తమపై అనవసరంగా నిందలు వేయడం తగదని సూచించాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP Politics  Karanam Balaram  Gottipati Ravi  

Other Articles