ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యానాథ్ పగ్గాలు చేపట్టాక పాలనాపరంగా దుందుడుకు నిర్ణయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన తీసుకునే కొన్ని నిర్ణయాలు మాత్రం కరుడుగట్టిన హిందుత్వ వాదిగా
ఉంటున్నాయన్నది ప్రతిపక్షాల ఆరోపణ. కేవల గై.. గంగ... గోరక్షక్ ఈ నినాదాలను మాత్రమే యోగి ప్రవేశపెడుతున్నాడని, స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకోని ఆరెస్సెస్ లాంటి వాళ్లకు కొమ్ము కాస్తున్నాడంటూ(జేడీయూ) తీవ్ర స్థాయలో విరుచుకుపడ్డాయి. అయితే వీటిని అంతే త్వరగా రియాక్ట్ అయ్యాడు యోగి.
ఒకవేళ ఆర్ఎస్ఎస్ అనేది గనక లేకుంటే దేశంలోని ప్రధాన భూభాగం పాక్ లో కలిసిపోయి ఉండేదని వ్యాఖ్యానించాడు. ఆర్ఎస్ఎస్ దేశంలో అతిపెద్ద జాతీయవాద సంస్థ అని పేర్కొన్నారు. స్వయం సేవకులు, ప్రచారకుల సాయంతో దేశానికి, సంస్కృతికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ప్రపంచంలోనే ఒకేఒక్క సంస్థ ఆర్ఎస్ఎస్ అని కొనియాడారు. ఆ సంస్థ లేదంటే ఆ సంస్థ నేత డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కనుక లేకుంటే పంజాబ్, జమ్ముకశ్మీర్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పాకిస్థాన్‌లో అంతర్భాగం అయి ఉండేవన్నారు.
ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం ఆశించకుండా ఆర్ఎస్ఎస్ నిస్వార్థంగా సేవలు అందిస్తోందని యోగి ప్రశంసించాడు. యోగి కామెంట్లపై మరో బీజేపీ నేత షైనా ఎన్సీ కూడా స్పందించింది. ఆ మూడు రాష్ట్రాల్లో ఎంత భిన్న సాంప్రదాయలు ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి రాష్ట్రాలు దాయాది దేశం పాలు కాకుండా కాపాడిన ఆర్ఎస్ఎస్ తో స్నేహం చేయటం తప్పేం కాదని వ్యాఖ్యానించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more