తెలంగాణ రాష్ట్రంలో మరో హైదరాబాద్ నగరంలా దూసుకుపోతున్న నగరం వరంగల్. ఈ నేపథ్యంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ స్థానిక యువతకు జాబ్ మేళా నిర్వహించింది. అర్హత కలిగన అశావహులను ఉద్దేశించిం ప్రసంగిస్తూ అమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఉద్యోగాల కోసం వచ్చిన వందలాది మంది అశావహుల సమక్షంలో అమె వారికి చేసిన సూచన కాస్తా రాజుకుంది. అయితే వేదిక మీద వున్న అమాత్యులు మాత్రం అమె వ్యాఖ్యలను ఖండించారు. అమె చేసిన సూచనను అశావహులు పాటించరాదని, నిజాయితీతో ఉన్నది వున్నట్లు చెప్పి ఉద్యోగాలను సంపాదించాలని మంత్రులు కోరారు.
వివరాల్లోకి వెళ్తే.. నిరుద్యోగుల కోసం ములుగు వద్ద తెలంగాణ ప్రభుత్వం అదేశాల మేరకు జిల్లా కలెక్టర్ అధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన కలెక్టర్ అమ్రపాలి.. ఉద్యోగం రావాలంటే అశావహులు కొన్ని అబద్దాలు ఆడాల్సివుంటుందని అన్నారు. అయితే అవి మీకు ఉద్యోగ అవకాశాలను కల్పించిన యాజమాన్యాలకు తెలియకుండా నిజం చేసేందుకు సర్వీసులోకి వచ్చిన తరువాత వాటిని నిజం చేయాలని సూచించారు.
అమ్రపాలి వ్యాఖ్యలతో జాబ్ మేళాకు హాజరైన మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలు కంగుతిన్నారు. వెంటనే స్పందించిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కలెక్టర్ వ్యాఖ్యలను ఖండించారు. ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వూల్లో అబద్దాలు ఆడితే వెంటనే దొరికిపోతారని అన్నారు. తెలివైన వారు ఎంపిక బోర్డులో ఉంటే వచ్చే ఉద్యోగం కూడా చేజార్చుకోవాల్సి వస్తుందని హితవు పలికారు. కేసీఆర్ సర్కార్ ఉన్నంత వరకు ఎవరూ అబద్ధాలాడి ఉద్యోగం తెచ్చుకోవాల్సి అవసరం ఉండదన్నారు. నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు చెప్పి ఉద్యోగాలను పొందవచ్చని, సరీసులోకి వచ్చిన తరువాత మీకు పనితీరును బట్టి యాజమాన్యాలే మీకు పదోన్నతులు కల్పిస్తాయని ఆయన సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more