బీహార్ లోని మంగర్ న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి కారణమైన మావోయిస్టులకు న్యాయస్థానం ఉరి శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. దేశసార్వత్రిక ఎన్నికల సందర్భంగా 2014లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లపై మెరుపుదాడికి పాల్పడి ఇద్దరు జవాన్ల మృతికి కారణమైన ఐదుగురు మావోయిస్టులకు ఉరిశిక్ష విధించింది. గత మూడేళ్ల విచారణ తరువాత ఈ కేసులో ఇవాళ తుది తీర్పును బిహార్లోని ముంగేర్ కోర్టు ఇవాళ వెలవరించింది.
వివరాల్లోకి వెళ్తే.. బిహార్లో 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న భద్రతా సిబ్బందిపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. ఖరగ్పూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గంగ్టా-లక్ష్మీపూర్ రోడ్డుపై మాటువేసిన మావోలు.. సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గోనగా, వారిలోలో ఐదుగురిని పోలీసులు ఆ తరువాత అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు సోమ్ గాడ్వా, రవింద్ర రాయ్ లు ప్రాణాలు కోల్పోగా, మరో పది మందికి గాయాలయ్యాయి.
ఈ కేసులో ముంగేర్ అడిషనల్ సెషన్స్ కోర్డు విచారణ చేపట్టి.. ఇవాళ తీర్పును వెల్లడించింది.అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ జ్యోతి స్వరూప్ శ్రీనివాత్సవ తీర్పును వెల్లడిస్తూ.. ఐదుగురు మావోయిస్టులు విపిన్ మండల్, అదిక్లాల్ పండిత్, రాటుకోడా, వానో కోడా, మనులను దోషులుగా తేల్చి వారికి ఉరిశిక్ష విధించింది. దీంతోపాటు రూ.25వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరిచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more