madhapur police gives shock to ruling mla అధికార పార్టీ ఎమ్మెల్యేకు మాదాపూర్ పోలీసుల జలక్..!

Madhapur police gives shock to ruling mla

ruling trs mla fined, ruling mla violates traffic rules, kale yadaiah, innova car, black film, nanakram guda toll gate, media, traffic policem chevella mla, traffic rules, penalty

Telangana ruling mla of chevella constituency has been fined by madhapur traffic police for having black film coating on his car

అధికార పార్టీ ఎమ్మెల్యేకు మాదాపూర్ పోలీసుల జలక్..!

Posted: 05/26/2017 12:41 PM IST
Madhapur police gives shock to ruling mla

చట్టసభలకు ఎన్నికైన వాళ్లం.. చట్టాలను చేస్తాం.. వాటిని అమలు పర్చేలా చూస్తాం ఇది ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు మాట. కానీ వారే నిబంధనలు అతిక్రమిస్తే.. తాను ఎమ్మెల్యేనని మినహాయింపు కోరితే.. ఇలాంటి తాజా ఘటన ఏకంగా అధికార పార్టీ తీర్దం పుచ్చుకున్న ఎమ్మెల్యేకు జరిగింది. చట్టాలను చేసే వాల్లే చట్టాలను అతిక్రమిస్తే.. ఎలా వుంటుందో.. ఆ అధికార ఎమ్మెల్యకు అర్థమైయ్యింది. అయితే ఎమ్మెల్యేకు మినహాయింపు కల్పించేందుకు పోలీసులు యత్నించినా అక్కడ మీడియా వుండటం వల్ల అది సాథ్యపడలేదు.

బ్లాక్ పిల్మలు కార్లకు అంటించడంతో వల్ల ఆ వాహనాలు ముందుకు రోడ్డుపై పరిస్థితులు ఎలా వున్నాయో తెలియ, అసలు ఆ వాహనంలో ఎలాంటి సంఘవిద్రోహ చర్యలు జరుగుతున్నాయో అర్థకాకపోవడంతో దేశవ్యాప్తంగా బ్లాక్ ఫిల్మలను తొలగించాలని ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. ఈ క్రమంలో తమ అదేశాలను ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటూ అన్ని రాష్ట్రాల డీజీపీలకు కూడా నోటీసులను పంపింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు బ్లాక్ ఫిల్మ్ తొలగింపు ఒక ప్రహసనంలా సాగింది.

ఆ మధ్య అమీర్ పేట్ లో, యూసుఫ్ గూడలో ప్రముఖ తెలుగు చలనచిత్రానికి చెందిన హీరోల కార్లను కూడా ట్రాపిక్ పోలీసులు పట్టుకుని వారి వాహనాలకు వున్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగింపజేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో మాత్రం కేవలం కొందరికి మాత్రమే మినహాయింపు కల్పించగా వారిని మాత్రం పోలీసులు వదిలేస్తున్నారు. ఆ జాబితాలో ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ఇలా అనేక మంది ప్రముఖులు వున్నారు. ఆ విషయం తెలిసో తెలియకో మొత్తానికి అధికార ఎమ్మెల్యే మాత్రం జరిమాన కట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి.. ఆనంతరం టీఆరఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే కాలె యాదయ్యకు పోలీసులు జరిమానా విధించారు. నానక్ రాంగూడ సమీపంలోని టోల్ గేట్ దగ్గర హైస్పీడ్ తో వచ్చే వాహనాలకు చెక్ పెట్టడంలో భాగంగా స్పీడ్ గన్ తో పాటు పెట్రోల్ వాహనాల్ని ప్రారంభించే కార్యక్రమం జరిగింది. ఆ సమయంలోనే గచ్చిబౌలి నుంచి నానక్ రాంగూడ టోల్ గేట్ వైపునకు ఒక కారు రావటం.. దానికి బ్లాక్ ఫిలిం అంటించి ఉండటాన్ని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ గుర్తించారు. ఆ వెంటనే కారును ఆపే ప్రయత్నం చేశారు.

డీసీపీ ఆదేశాలతో ట్రాఫిక్ ఎస్ ఐ విజయ్ మోహన్ సదరు వాహనాన్ని టోల్ గేట్ దగ్గర నిలిపి వేశారు. అయితే.. తాను ఎమ్మెల్యేనని కాలె యాదయ్య చెప్పుకున్నారు. అయితే.. అక్కడ మీడియా ప్రతినిధులు ఉన్నారని.. వదిలిపెట్టటం కుదరదని తేల్చి చెప్పటం.. ఫైన్ కట్టకుండా లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కుపోవటంం ఎందుకన్న ఉద్దేశంతో ఫైన్ కట్టేసి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. మీడియా ఉన్నప్పుడే కాదు.. లేనప్పుడు కూడా రూల్స్ను బ్రేక్ చేసిన వాళ్లు ఎవరైనా ఫైన్ విధిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక మరికోందరు మాత్రం జరిమాన విధించడంతో పాటు బ్లాక్ ఫిల్మను కూడా పోలీసులు తొలగింప జేయాల్సిందని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles