Son filmed Parents romance for Facebook Friend

Parents private video to fb friend

Facebook Friend Adult Videos, Parents Private Video, Parents Romance Blackmail, Facebook Blackmail, FB Friend Force, Unknown Chat Trouble Family, Facebook Romance, Son Filmed Parents, Son Blackmail Parents

Bangalore Kid sent Parents Sex video to Facebook Friend. Later they were Blackmailed that upload in Adult Sites demand money.

ఫేస్ బుక్ ఫ్రెండ్ కోసం పాడు పని

Posted: 05/27/2017 08:40 AM IST
Parents private video to fb friend

తనకు తెలీకుండానే ఓ 13 ఏళ్ల కుర్రాడు చేసిన పనితో ఆ కుటుంబం మొత్తం చిక్కుల్లో పడింది. సోషల్ మీడియాకు బానిసగా మారి అపరిచితుడితో ఛాటింగ్ చేసి ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు. ఏకంగా తన తల్లిదండ్రుల ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీసి సమస్యను కొని తెచ్చుకున్నాడు. అవతలి వ్యక్తి బ్లాక్ మెయిలర్ గా మారటంతో ఆ పేరెంట్స్ బెంగళూర్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళ్లితే.. హీరోహళ్లి-ఆంధ్రాహళ్లి రోడ్‌లో నివసించే ఓ కుటుంబంలో 13 ఏళ్ల బాలుడు గతేడాది ఫేస్ బుక్ అకౌంట్ తెరిచాడు. తేజల్ పటేల్ అనే వ్యక్తి నుంచి బాలుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, అతడు దానిని ఓకే చేశాడు. ఆపై తేజల్ పటేల్, చిన్నారికి అభ్యంతరకర చిత్రాలు పంపడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీకి చెందిన వీడియోలు, అమ్మాయిల న్యూడ్ ఫొటోలు పంపేవాడు. మెల్లిగా అలా అలవాటు అయ్యాక ఈ గత నెల మొదట్లో సదరు బాలుడి పేరేంట్స్ న్యూడ్ ఫోటోలు పంపాల్సిందిగా కోరాడు.

అతడి కోరిక మేరకు తల్లిదండ్రులు ప్రైవేటుగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియో తీసి దానిని తేజల్ పటేల్‌కు పంపాడు. వాటిని అందుకున్న వెంటనే అతని పేరెంట్స్ ఫోన్ నంబర్ సంపాదించి, బ్లాక్ మెయిలింగ్ చేయటం ప్రారంభించాడు. తనకు కోటి రూపాయలు ఇవ్వకుంటే ఆ వీడియోను పోర్న్ వెబ్‌సైట్‌లలో పెడతానని బెదిరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించగా, ఐపీ అడ్రస్ ఆధారంగా అతన్ని పట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Bangalore  Facebook  Blackmail  Private Video  

Other Articles