Manipur CM Biren Singh son awarded 5 year jail sentence

Manipur cm s son awarded 5 years jail term

Manipur CM Son, Ajay Meetai Murder Case, Ajay Meetai Jail Term, CM Son Jail Conviction, Biren Singh Son Jailed, Biren Singh Road-Rage Death Case, CM Son in Jail, CM Biren Singh Son jail, CM Son 5 Years Jail

Manipur CM N Biren Singh's son gets 5-year jail in a road-rage death case. Ajay Meetai killed Irom Roger in an accident. SC asks Centre to explore safety provision for Manipur family.

ఆ సీఎంకి కోలుకోలేని దెబ్బ తగిలింది

Posted: 05/29/2017 03:36 PM IST
Manipur cm s son awarded 5 years jail term

మన న్యాయస్థానాల శిక్షల అమలులో కాస్త ఆలస్యమైనప్పటికీ.. వాటి ముందు మాత్రం అందరూ సమానమే అని కొన్ని కొన్నిసార్లు నిరూపిస్తూ ఉంటాయి. తాజాగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తనయుడు అజయ్ మీతాయ్ సింగ్ విషయంలో ఇది మరోసారి రుజువయ్యింది. ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన ఆదేశాలు వెలువరించింది.

2011 లో అజయ్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి రోగర్ అనే ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు. తన వాహనం వెళ్లేందుకు సైడ్ ఇవ్వకపోవటంతో ఏకంగా గుద్దేసి వెళ్లిపోగా అతను చనిపోయాడు. ఈ కేసు మణిపూర్ లోని ఓ ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగింది. పూర్తి వాదోపవాదాల అనంతరం ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధించింది. సెక్షన్ 304 (దోషరహిత హత్య), మోటారు వాహనాల చట్టంలోని పలు సెక్షన్లను కింద తీర్పును వెలువరించింది. కేసు విచారణ దశలో ఉండగానే బీరేన్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా, ఆపై మృతుడి బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తమకు బెదిరింపులు వస్తున్నాయని, రక్షణ లేకుండా పోయిందని, మణిపూర్ కోర్టులో తమ తరఫున వాదించేందుకూ న్యాయవాదులు ఆసక్తి చూపడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి, మణిపూర్ ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇచ్చింది. ఆ కుటుంబానికి రక్షణ చర్యలు కల్పించాలని ఆదేశించింది. ఇంతలోనే కింది కోర్టులో తీర్పు వెలువడటం విశేషం. ఇంకోపక్క అజయ్ తరపున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రాకపోవటం చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manipur  Biren Singh SOn  Road Rage Death Case  5 Years Jail  

Other Articles