దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న దేశ భద్రతా బలగాలు మరీ ముఖ్యంగా అర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ బలగాలు కనబడితే వారికి గౌరవ సూచకంగా నమస్కరించి మీకు అండగా మేమున్నాం అని చాటాలని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపుతో దేశప్రజలు వారిని అక్కున చేర్చుకుంటున్నారు. వారు ఎక్కడ కనిపించినా వారికి సెల్యూట్ చేస్తున్నారు. అయితే కొందరు భద్రతా బలగాలకు చెందిన వ్యక్తులు చేస్తున్న అకృత్యాలు మాత్రం యావత్ అర్మీ పరువు తీసేలా వున్నాయి. ఇందుకు విశాఖలో జరిగిన ఘటనే నిదర్శనం.
యావత్ దేశంలోనే తెలుగు అమ్మాయిలంటే ఒక ప్రాముఖ్యత వుంది. సర్వసాధారణంగా అన్ని రాష్ట్రల యువతులు ఒకింత సహనం, ఓర్పు, సంయమనం వుంటే అవి మన తెలుగు అమ్మాయిలలో మరింత ఎక్కువ. అందుకనే రోడ్లపై ఎవరెన్ని పిచ్చి వేశాలు వేసినా పట్టించుకోరు. అయితే వారిలోని సహనం నశిస్తే మాత్రం అపర భద్రకాళీ అవతారం ఎత్తుతారన్న విషయం కూడా ఇప్పటికే పలు సందర్భాలలో వ్యక్తం అయిన విషయం తెలిసిందే. అందుకనే మనమ్మాయిలను అబలలే కాదు అవసరం వచ్చినప్పుడు సబలలు కూడా అని అంటారు. ఈ విషయం విశాఖలో విధులు నిర్వహించే నేవి ఉద్యోగి.. నెమ్మదిగా తెలిసివచ్చింది.
హర్యానాకు చెందిన సందీప్ నర్వాల్ విశాఖ నేవీలో విదులు నిర్వహిస్తూ.. మల్కాపురంలోని నేవీ క్వార్టర్స్ లో నివాసం వుంటున్నాడు. దేశానికి సేవలందించే ఉద్యోగం లభించినా.. అతని బుద్ది మాత్రం వంకర మార్గాన్ని వీడలేదు. అందమైన అమ్మాయిలు కనిపిస్తే వెంటబడ్డేవాడు. అంతటితో అగకుండా వారి కోసం రోజూ అ వీధిలు పచార్లు కొట్టేవాడు. ఈ క్రమంలో ఆఫీషియల్ కాలనీలోని ఓ ఇంటిపై సందీప్ నర్వాల్ దృష్టి పడింది. అక్కడ ఓ ఇంటిలో అందమైన యువతి ఉండటమే ఇందుకు కారణం.
అనుకోకుండా రోజు మాదిరిగానే ఆ రోజు కూడా అఫీషియల్ కాలనీలోని ఆ వీధిలోకి వచ్చిన సందీప్.. అదే సమయంలో ఆ ఇంటి బాత్రూమ్లో ఓ యువతి స్నానం చేస్తున్న విషయాన్ని గమనించి.. ఏకంగా సెల్ ఫోన్ తో షూట్ చేశాడు. బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న యువతి అలకిడి గమనించి.. చూడగా, సందీప్ సెల్ ఫొన్ కనిపిచింది. దీంతో వాడని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కేకలు వేయడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులు, ఇరుగుపోరుగు వారు వచ్చి వాడ్ని చితకబాదారు.
కాగా తన స్నానపు దృశ్యాలు తీసాడని తెలిసిన యువతి అపరకాళిలా మారింది. నడిరోడ్డు మీదే వాడిని చెప్పు తీసుకుని రఫ్పాడించింది. యువతి కోపాన్ని దిగమించుకునేందుకు కూడా సహించలేదు. దీంతో రెండు చెంపలు చెడాపెడా వాయించి వాచిపోయేలా చేసింది. ఇది చూసిన బంధవులు సందీప్ ను చుట్టుముట్టి వాడి బట్టలు చిగిరిపోయేలా కుమ్మేశారు. కాగా స్థానికులు డయిల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఈ కామాంధుడిని అదుపులోకి తీసుకుని నిర్భయకేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more