పైన దగా కింద దగా, కుడి ఎడమల దగా, దగా అన్నట్లుగా.. కాసులు రావాలే కానీ మట్టిని కూడా ప్యాక్ చేసి మాయమాటలతో విక్రయించి వ్యాపారం చేసేస్తారు కేటుగాళ్లు. ఇప్పటికే పశువుల వ్యర్థాలు, యముకలతో కల్తీ నూనెను తయారు చేయించి విక్రయిస్తున్న బాగోతం బయటపటడంతో అధికారులు అకస్మిక తనిఖీలకు పనిచెబుతున్నారు. తాజాగా అధికారులు జరిపిన తనిఖీల్లో అనేక హోటళ్లలో కుళ్లిపోయిన మాంసాన్ని నిల్వచేసి.. అర్డర్ రాగానే దానినూ తీసి వండివార్చి వడ్డీస్తున్నారన్న విషయం బయటపడింది.
దీంతో వీకెండ్ లో హోటళ్లకు వెళ్లి సరదాగా కుటుంబంతో ఎంజాయ్ చేయాలనుకునేవారు జంకుతున్నారు. ఈ క్రమంలో అనేక హోటళ్లలో ఇలాంటి నాణ్యత లోపించిన మాంసంతోనే వంటలు చేస్తున్నారని నగరంలోని సుమారు 60 హోటళ్లకు పైగా జరిమానాలు విధించిన అధికారులు పలు హోటళ్లను సీజ్ కూడా చేశారు. ఇప్పటికే అడ్డదారుల్లో అప్పనంగా జనారోగ్యంతో అటలాడుకుంటూ డబ్బులను సోమ్ముచేసుకుంటున్న వైనం తెలిసిన సగటు బోజన ప్రియులు ఇక ఇళ్లకే పరిమితం కావాలని నిర్ణయానికి వచ్చారు.
ఈ తరుణంలో మరో విషయం బయటకు వచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ గుడ్లు బయటపడ్డాయి. ఇక కోడిగుడ్డను తింటే రోగనిరోధక శక్తి మాట దేవుడెరుగు కానీ రోగాలు వస్తాయన్న భయంతో ఇక కోడిగుడ్ల జోలికి కూడా ఎవరూ వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే దానిని మర్చిపోతున్న క్రమంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం బాగోతం బయటపడింది. ప్లాస్టిక్ రైస్ అమ్మకాలపై ఇరు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైదరాబాద్, శ్రీశైలం సహా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయి.
ఈ పిర్యాదులపై కదిలిన అధికార, పోలీసు యంత్రాంగం.. ఈ బియ్యం ఎక్కడి నుంచి సరఫరా అయ్యింది.. ఎవరెవరికీ సరఫరా అయ్యాయన్న విషయాలను చేధిస్తూ.. ఏకంగా డొంకనే కదిలించే పనిలో వున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాస్టిక్ రైస్ బస్తాలను సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలావుంటే.. ఈ బియ్యంతో వడిన అహారాన్ని తీసుకుంటే అనేక అరోగ్య సమస్యలు వస్తాయని అధికారులు తెలిపారు. వీటిని తీసుకుంటే అజీర్తి, కడుపు ఉబ్బరంతో వెంటనే రాగా, భవిష్యత్తులో అనేక అనారోగ్యాలకు ఇవి దారితీస్తాయని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more