Goat Chews Rs 66000 Cash From Owner's Pocket మేక ఏం తినిందో తెలిసి.. లబోదిబోమన్న యజమాని

Goat chews rs 66000 cash from owner s pocket

goat chews owners cash, goat chews currency notes, goat chews up owner's Rs 66000, goat munches owners cash, goat munches Rs 2000 currency notes, Sarvesh Kumar Pal, goat eats farmer's money, Siluapur village, kanpur, goat, Kannauj district, Rs 66000, house construction, Rs 2000 note, Indian currency, Indian farmer

a hungry goat gave a rude shock to its owner after it chewed up currency notes worth Rs 66,000 that the man had kept in the pocket of his trouser.

మేక ఏం తినిందో తెలిసి.. లబోదిబోమన్న యజమాని

Posted: 06/07/2017 05:10 PM IST
Goat chews rs 66000 cash from owner s pocket

ఉత్తర్ ప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా పరిధిలోగల సిలువాపూర్ గ్రామంలో ఓ మేక తన యజమానికి ఎక్కడ లేని గుర్తింపును తెచ్చిపెట్టింది. ట్రెడింగ్ న్యూస్ గా మారడంతో ఏకంగా జాతీయ మాద్యమాలను కూడా ఈ మేక అకర్షించింది. మేక చేసిన పనేంటో తెలిసి తొలుత లబోదిబో మన్న యజమాని.. తరువాత మాత్రం తన మేక కథనాలపై నెట్ జనుల స్పందనలు చూసి.. వారు తీసుకోమన్న చర్యలు విని నవ్వుకున్నాడు. భారతీయ గ్రామీణ జీవనంలో పశుపక్షాదులతో అక్కడి మనుషులకు వుండే అనుబంధం తెలియక ఇలాంటి సలహాలు ఇస్తున్నారని, మాకు మాత్రం ఇది మేక కాదని, తమ బిడ్డ లాంటిదని వారు చెప్పారు.

ఇంతకు మేక చేసిన పనేంటి.. దానికంతటి ప్రచారమేంటి.. మేక ఏకంగా ట్రెండింగ్ న్యూస్ గా నిలవడమేంటి అనేగా మీ సందేహం..? మ్యాటర్ లోకి ఎంటర్ అయితే.. కనౌజ్ జిల్లా పరిధిలోగల సిలువాపూర్ గ్రామం సర్వేష్ కుమార్ పాల్ అనే రైతు వద్ద వుండే మేకకు బాగా ఆకలేసింది. దగ్గర్లో తినడానికి ఆకులు, అలములు ఏమీ కనిపించలేదు. కానీ యజమాని ప్యాంటు జేబులోంచి ఏవో రంగు కాగితాలు మాత్రం కనిపించాయి. ఆ సమయంలో యజమాని కూడా అక్కడ లేదు. ఆయన స్నానం చేయడానికి వెళ్లాడు.

దీంతో లేటు ఎందుకు అనుకుందో లేక అకలి తీర్చుకునేందుక ఏ కాయితాలైతే ఏంటి అనుకుందో తెలియదు కానీ ఏకంగా యజమాని జేబులోంచి రంగు కాయితాలను నమిలేసింది. అప్పుడే బయటకు వచ్చిన రైతు సర్వేష్ కుమార్ పాల్ మేక ఏదో నమలడాన్ని గమనించి దాని నోటి వంక చూసి లబోదిబోమన్నాడు. తన మేక తినింది ఏవో రంగు కాయితాలను కాదు.. తన జేబులోని ఆరవై రాు వేల రూపాయలని తెలుసుకుని షాక్ అయ్యాడు. ఇప్పడు సందేహాలు తీరాయా..? మేక ఆరగించింది యజమాని ప్యాంటు జేబులో పెట్టుకున్న రూ. 66వేల విలువ చేసే 2వేల రూపాయల నోట్లు

సర్వేష్ కుమార్ పాల్ తన ఇంట్లో జరుగుతున్న నిర్మాణపు పనుల కోసం ఇటుకలు కొనేందుకు రూ. 66వేల నగదు జేబులో పెట్టుకున్నాడు. తీరా వాటిని మేక తినేయడం చూసి జాగ్రత్తగా బయటకు తీసే ప్రయత్నం చేసినా, కేవలం రెండు నోట్లే బయటకు వచ్చాయి. అవి కూడా బాగా పాడైపోయి ఉన్నాయి. మిగిలిన 31 నోట్లను పూర్తిగా మేక జీర్ణం చేసుకుంది. కాయితాలను అరగించే మేకకు కరెన్సీ నోట్ల కూడా కాయితాలనే భావించి అరగించిందని ఆయన తెలిపారు.

ఈ వార్త ట్రెండింగ్ గా మారడంతో.. నెట్ జనులు కూడా కామెంట్లు పెట్టారు. అయితే తమ గ్రామంలోని విద్యావంతులు నెట్ జనులు తన మేకపై చేసిన కామెంట్లు విని కడుపార నవ్వుకున్నాడు. కొందరు దానిన అమ్మేయాలని చెప్పగా, మరికోందరు వైద్యలు వద్దకు తీసుకెళ్లి వాంతి చేసుకునేలా చేయించాలని, ఇలా అనేక మంది అనేక సూచనలు ఇచ్చారని చెప్పారు. ఇక మరోకరు మాత్రం తీవ్ర నేరం చేసిన మేకను పోలీసులకు అప్పగించాలని కూడా సూచించారని.. అయితే ఇది తమకు మేక మాత్రమే కాదని తమ బిడ్డలాంటిదని సర్వేష్ తెలిపాడు. కాగా, డబ్బులు తిన్న మేకను చూసేందుకు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా తండోపతండాలుగా సర్వేష్ ఇంటికి వస్తున్నారు. ఆ మేకతో కొంతమంది సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarvesh Kumar Pal  Indian farmer  goat  Siluapur village  kanpur  Rs 66000  Rs 2000 notes  

Other Articles