Jet Airways announces special discounted fares జెట్ ఎయిర్ వేస్ నుంచి బంఫర్ అఫర్..

Jet airways announces special discounted fares on selected routes

jet airways offer, jet airways discount, jet airways monsoon offer, jet airways monsson sale, jet airways ticket prices, ticket prices jet airways, jet airways, jet airways discounts

The premium service airline announced a special discounted all-inclusive, one-way economy class fares priced as low as Rs 1,111 on a few domestic sectors for a limited time period.

జెట్ ఎయిర్ వేస్ మాన్సూన్ సేల్ బంఫర్ అఫర్..

Posted: 06/07/2017 07:07 PM IST
Jet airways announces special discounted fares on selected routes

భారత మార్కెట్లో పెరుగుతున్న పోటీకి అనుకూలంగా విమానయాన సంస్థలు సీటు అక్యూపెన్సీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు లాభాలను అర్జించేందుకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో విమానయాన ప్రయాణికులకు చౌకధరల్లో గగనయానం చేసే అవకాశం లభిస్తుంది. తాజాగా జెట్ ఎయిర్ వేస్ విమానాయాన సంస్త కూడా బంపర్ ఆఫర్ తో ప్రయాణికుల ముందుకొచ్చింది. ఇటీవలే ఎయిర్ ఏషియా, ఇండిగో విమాన టిక్కెట్లపై రేట్లు తగ్గించగా.. ఆ బాటలోనే జెట్ ఎయిర్ వేస్ తాజా బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

ఈ ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా ఎంపిక చేసిన మార్గాల్లో రూ.1,111కే టిక్కెట్ ను అందించనున్నట్టు పేర్కొంది. పరిమితి కాల వ్యవధిలో ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది. '' ఇట్స్ రైనింగ్ డీల్స్'' పేరుతో వన్-వే ఎకానమీ క్లాస్ టిక్కెట్లలో ఈ స్పెషల్ ధరలు అందుబాటులో ఉంటాయని జెట్ ఎయిర్ వేస్ పేర్కొంది. భారత్ లో జెట్ ఎయిర్ వేస్ ఆపరేట్ చేసే విమానాలకు ఈ స్పెషల్ స్కీమ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.  నేటి నుంచి జూన్ 9 వరకు ఈ డిస్కౌంటెడ్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని జెట్ ఎయిర్ వేస్ చెప్పింది.  
 
ఈ ఏడాది జూన్ 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు ప్రయాణాలకు ''ఇట్స్ రైనింగ్ డీల్స్ '' స్కీమ్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లను వాడుకోవచ్చు. అయితే ఈ స్కీమ్ కింద ఎన్ని సీట్లను అందుబాటులో ఉంచుతుందో జెట్ ఎయిర్ వేస్ పేర్కొనలేదు. ఎకానమీ క్లాస్ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.  ఇంటర్ లైన్, కోడ్ షేర్ విమానాలకు ఈ డిస్కౌంటెడ్ టిక్కెట్లు వర్తించవు. అచ్చం ఇలాంటి ఆఫర్ నే ఎయిర్ ఏషియా ఇండియా కూడా ప్రకటించింది. ఎంపికచేసిన రూట్లలో వన్-వే టిక్కెట్లను రూ.1,099కే అందించనున్నట్టు తెలిపింది. ఇండిగో కూడా గతవారం ఎంపికచేసిన వన్-వే ఫ్లైట్స్ లో రూ.899కే టిక్కెట్ ధరలను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jet airways  monsoon sale offer  discount  ticket prices  airways discounts  

Other Articles