సామాజిక సందేశం ఇస్తామంటే ఎవరూ వినరూ కానీ దానిని వీడియో తీసి నెట్ లె పెడితే మాత్రం అనేక మంది వీక్షిస్తారు. సరిగ్గా అలానే జరిగింది అక్కడ కూడా. ఓ సామాజిక సందేశాన్ని ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో నడుంబిగించిన ఓ పరిశోధన బృందం.. ఓ రద్దీగా వుండే వీధిని ఎంచుకుని మరీ తమ సందేశాన్ని చెప్పాలనుకుంది. సమాజంలో వివిద రకాలైన మనుషులు, వివిధ మనస్థత్వాలు కలిగి వుంటారని రుజువు చేయాలనుకుంది. ఓ బిక్షువు తన వద్దనున్న డబ్బు వద్దని, కావాల్సిన వారు తీసుకెళ్లాలని బోర్డు పెడితే రెండున్నర గంటల్లో డబ్బంతా మాయమైంది.
మ్యాటర్ లోకి ఎంటరైతే.. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ కి చెందిన ‘డాం ది మాప్స్’ సామాజిక సందేశాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో ఆసక్తికర అంశాన్ని ఎంచుకుంది. ఇ:దుకు గాను గ్రీన్ (39) అనే వ్యక్తికి బిచ్చగాడి వేషం వేయించింది. మొల్ బోర్న్ లోని రద్దీ వీధిలో కూర్చోబెట్టి, అతనికి 100 డాలర్ల చిల్లర నాణేలను ఇచ్చి...ఒక బాక్స్ లో ఉంచింది. అతని ముందు ఒక అట్టపై ‘నా దగ్గరున్న డబ్బు నాకు అవసరం లేదు. కావాలంటే తీసుకోండి’ అని రాసిన బోర్డును ఉంచింది. ఈ తతంగాన్నంతా వీడియోగా చిత్రీకరించింది.
ఆ వీధిలో 2 గంటల 30 నిమిషాల్లో 10,000 మంది అతనిని చూస్తూ, ఆ బోర్డు చదువుతూ వెళ్లిపోయారు. అతని దగ్గర డబ్బులు తీసుకునేందుకు చాలా మంది వెనుకాడగా, కొందరు మాత్రం ఏమాత్రం సిగ్గు లేకుండా డబ్బులు తీసుకెళ్లారు. కొంత మంది అతనికి బిచ్చం వేసే ప్రయత్నం చేశారు. ఒక యువతి డబ్బుకు ప్రాధాన్యత లేదని బాగా చెబుతున్నాని అభినందించి అతనికి కాఫీ కూడా ఇస్తుంది. చాలా మంది అతని ప్రతిపాదనకు, డబ్బు అవసరం లేదని చెప్పడానికి ఆశ్చర్యపోయారు. అయితే ఆ సమయంలో అతని ముందు ఉంచిన 99 డాలర్ల కాయిన్స్ ను ఖాళీ చేసేశారు. మనిషి తీరిది అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేయగా అంతా ఆసక్తిగా చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more