పిల్లలు కాదు పిడుగులని అన్నా.. పిల్ల రాక్షసులు అని పెద్దలు తమ పనులకు వారు అటకం కలిగించిన ప్రతీసారి విసుగుతో అన్నా.. వారు చేసే పనులను ప్రశాంతంగా వున్న సమయంలో నిషితంగా పరీక్షిస్తే మాత్రం నవ్వులు పూయించడంతో పాటు వారి తల్లిదండ్రులను అలోచింపజేస్తాయి. అలా అలోచింపజేస్తున్న వీడియోలు ఇప్పటికే అనేకం అంతర్జాలంలో హైలెట్ అయ్యాయి. పిల్లులు చేసే చిన్నపనులు వారిలోని సృషనాత్మకతను, ధైర్యాన్ని, చిన్నబుచ్చుకునే తత్వాన్ని బయటపెడుతుండగా, వారిలోని నెగిటివ్ షేడ్స్ వుంటే మార్చుకునే వీలు కూడా కల్పిస్తుంది. తల్లిదండ్రులు తమ బిడ్డలను పడుకోబెడితే వారు చేసిన రచ్చ కూడా ఆ మధ్య వైరల్ అయ్యింది.
ఇటీవల తన తల్లికి తండ్రి ముద్దు పెడితే దానిని జీర్ణించుకోలేని చిన్నారి ఏడుపును లంఖించుకున్న వీడియో నెల్ లో హల్ చల్ చేయగా, మూసాపేట్ లో బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు రాత్రి నిర్ఝన సమయంలో విడిది ఇంటి నుంచి తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా, గ్రామసింహాలను ఒక్కసారిగా వారిని అడ్డగించగా, చిన్నారి చూపిన సాహసం కూడా వైరల్ కాగా మారి నెట్ జనులను అకట్టుకున్న విషయం తెలిసిందే.
సరిగ్గా అలాగే తాజాగా మరో ఇద్దరు చిన్నారుల వీడియో నెట్ జనులు అమితంగా అకర్షిస్తుంది. చిన్నారి అన్నాదమ్ముల మధ్య ఉండే అనుబంధాన్ని ఇది చాటుతూనే.. ఏడుస్తున్న తమ్ముడికి తెలియని విద్య నేర్పించి.. తల్లిదండ్రుల వ్యూహాలను ఎలా దెబ్బ కొట్టాలో నేర్పుతున్న వీడియో సంచలనంగా మారింది. డైలీ బంప్స్ ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసిన ఆ వీడియోను సుమారు 4 కోట్ల మంది వీక్షించారు. అంతలా హల్చల్ చేస్తున్న ఆ వీడియోలో ఏముందంటూ అలోచిస్తున్నారా..?
జైలు లాంటి బెడ్ నుంచి ఎలా తప్పించుకోవాలో అన్న తన తమ్ముడికి చెబుతున్న వీడియో ఇది. ఆటలాడే సమయం అయిపోయిందంటూ ఇద్దరు పిల్లలు ఒలివర్, ఫిన్లను తల్లిదండ్రులు బెడ్ ఎక్కించేశారు. అయితే.. ఇంకా కలిసి ఆడుకోవాలని అనుకున్నారో ఏమో ఆ పిల్లలు అందుకోసం పెద్ద సాహసమే చేశారు. ఒలివర్ తన తమ్ముడికి బెడ్ నుంచి ఎలా బయటపడాలో పెద్ద డెమాన్స్ట్రేషన్తో చూపించి.. ఎట్టకేలకు తన తమ్ముడికి విముక్తి కల్పిస్తాడు. అంతేనా.. 'యూ కెన్ డూ ఇట్' అంటూ తమ్ముడిని ఒలివర్ ఎంకరేజ్ చేసిన విధానంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆలస్యమెందుకు మీరూ ఆ వీడియోను వీక్షించండీ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more