man stabs woman to death for rejecting his love proposal ప్రేమను తిరస్కరించిందని యువతి హత్య

Telangana man stabs woman to death for rejecting his love proposal

lover stabed, girl stabbed to death, girl murdered rejecting love, Murder, Telangana, Stabbed to Death, Love Proposal, Marriage, gayatri, srikanth, crime

A 22-year-girl Gayatri, was a native of Yadgaripalli in Yadagirigutta. was murdered, one day prior to her engagement in Yadadri

ప్రేమోన్మాది ఘాతుకం: తిరస్కరించిందని యువతి హత్య

Posted: 06/10/2017 06:58 PM IST
Telangana man stabs woman to death for rejecting his love proposal

తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి త్వరలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి బలైంది. యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి అనే యువతిని శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెను సమీప భువనగిరి ఆసుపత్రికి తరలింస్తుండగా మార్గమధ్యలోనే అమె కన్నుమూసింది. తెలంగాణలో అడపడచులపై దారుణాలు జరిగితే సహించేది లేదని స్వయంగా ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేసినా.. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోవడం పలు ప్రశ్నలకు తావిస్తుంది.  
 
వివరాల్లోకి వెళితే... యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి డిగ్రీ చదువుతోంది. ఈమె కళాశాలకు వెళ్లే సమయంలో శ్రీకాంత్ అనే యువకుడు తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. గత 6 నెలలుగా ఈ వేధింపులు సాగుతుండగా ఈమధ్యనే గాయత్రి తల్లిదండ్రులు అతడికి వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కుమార్తె గాయత్రికి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కూడా కుదిరింది. మరో 10 రోజుల్లో నిశ్చితార్థం.
 
విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తలుపు వేసి వున్నా బద్ధలుకొట్టి లోనికి ప్రవేశించాడు. తలుపు చప్పుడు విని విద్యార్థిని సోదరుడు వచ్చేలోపుగానే ఆమెను విచక్షణరహితంగా పొడిచాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోగానే నేరుగా కత్తితో సహా భువనగిరి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా పెళ్లిపీటలెక్కాల్సిన తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలని గాయత్రి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murder  Telangana  Stabbed to Death  Love Proposal  Marriage  crime  

Other Articles