తమిళనాడులో మరో డ్రామాకు తెరలేచింది. అన్నాడీఎంకే పార్టీ ముక్కలుగా చీలటమే కాదు.. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకునిపోయేదాకా వెళ్లింది. అమ్మ జిరాక్స్ గా అభిమానులు పిలుచుకుంటున్న దీపా జయకుమార్ సంచలన ఆరోపణలకు దిగింది. తన సొంత సోదరుడే మేనత్త జయలలితను హత్య చేశాడని వ్యాఖ్యలు చేసి పెను దుమారం రేపింది.
శశికళతో అధికారం కోసం చేతులు కలిపిన దీపక్ హత్య చేశాడని చెబుతోంది. తన పిర్గా ఎంజీఆర్ అమ్మ దీపా పెరవై అనుచరులతో కలిసి పోయెస్ గార్డెన్ కు వెళ్లిన దీపా జయకుమార్ ను వేదనిలయంలోకి వెళ్లకుండా దీపక్ అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు.
దీంతో ఆందోళన చేసి, ఇంటికి చేరిన దీప మీడియాతో మాట్లాడుతూ, శశికళతో కుమ్మక్కై తన సోదరుడే అత్త (జయలలిత) ను అంతమొందించాడని, ఇప్పుడు దినకరన్ తో చేతులు కలిపి తననూ అంతమొందించాలనుకుంటున్నాడని ఆరోపించింది. పొయెస్ గార్డెన్ కు సంబంధించిన పత్రాలు తన దగ్గర పెట్టుకున్నాడని, ఒకసారి రావాలని ఫోన్ చేసిన దీపక్ తాను అక్కడికి చేరుకున్న అనంతరం తనను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించాల్సి వచ్చిందని ప్రశ్నించింది.
దీనిపై దీపక్ సమాధానమిస్తూ, తన సోదరి చీప్ పబ్లిసిటీకి పాకులాడుతోందని ఎద్దేవా చేశాడు. మొత్తానికి ఈ ఇద్దరు వేద నిలయాన్ని దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కాగా, ఇంకోపక్క దీనిని అమ్మ స్మారక భవనంగా మార్చాలంటూ పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
విలీనం చర్చలు క్లోజ్...
అన్నాడీఎంకే రెబల్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కీలక నిర్ణయం తీసుకున్నాడు. పళని వర్గంతో విలీన చర్చల కోసం ఏర్పాటు చేసిన ప్యానల్‌ను రద్దు చేస్తున్నట్టు పన్నీర్ సెల్వం ఆదివారం ప్రకటించేశాడు.కాగా, కొన్ని డిమాండ్లతో పార్టీని అన్నాడీఎంకే (శశికళ)లో విలీనం చేసేందుకు ఓపీఎస్ ముందుకొచ్చారు. శశికళ, ఆమె కుటుంబ సభ్యులను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించడంతో పాటు మరికొన్ని డిమాండ్లను పళని ముందుంచారు. అయితే ఇరు వర్గాల మధ్య చర్చలు అసంపూర్తిగా మిగిలాయి.
శశికళ వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు పళని వర్గం అంగీకరించలేదు. అయితే పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో సీనియర్ లీడర్ల ఒత్తిడి మేరకు ఆయనీ ప్రకటన చేశాడు. ఓపీఎస్ ప్రకటనతో కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more