ఆదరణ పేరుతో అక్కున చేర్చుకున్న ఓ చిన్నారిపై ఓ మృగం దాష్టీకానికి పాల్పడింది. విషయం ఎలాగోలా న్యాయస్థానంకు చేరింది. చిన్న పిల్ల కావటంతో సాక్ష్యం చెల్లదని, తన శిక్ష తప్పుతోందని లోపల అనుకున్నాడు ఆ కిరాతకుడు. కానీ, పదేళ్ల ఆ పసికందు మాత్రం పెద్దకు షాక్ ఇచ్చింది. ఆ దెబ్బకు ఊచలు లెక్కిస్తున్నాడు కామాంధుడు.
కోల్‌కతాకు చెందని చిన్నారి (10) తల్లిదండ్రులు విడిపోవటంతో, ఢిల్లీలోని తన మేనత్త ఇంట్లో ఉండి చదువుకుంటోంది. రెండేళ్ల క్రితం నుంచి అంటే బాలికకు 8 ఏళ్ల వయసు నుంచే మామయ్య అక్తర్ అహ్మద్ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గతేడాది జూన్‌లో అక్తర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే బాలిక కావాలనే నిందితుడిని వేధిస్తోందని, అత్యాచారం జరిగిందనడానికి సరైన సాక్ష్యాధారాలు లేవని నిందితుడి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు.
బాలిక ఆరోపణలను పరిగణనలోకి తీసుకోరాదని కోరాడు. అయితే సరిగ్గా ఇక్కడే కథ మలుపు తిరిగింది. విచారణలో భాగంగా కోర్టులో బాలికకు ఓ పేపర్, క్రేయాన్లు ఇచ్చి ఏం జరిగిందో బొమ్మ గీసి చూపించమనగా, బాలిక తనపై జరిగిన అత్యాచారం తీరును కళ్లకు కట్టినట్టు బొమ్మ గీసి చూపించింది. ఓ ఇంట్లో చేతిలో బెలూన్లు పట్టుకుని నిల్చున్న బాలిక తన దుస్తులు దూరంగా పడి ఉన్నట్టు బొమ్మ వేసింది. అంతేకాక తన ఆవేదనకు అద్దంపట్టేలా దిగులును ప్రతిబింబించే రంగులు వాడింది.
ఆమె బొమ్మను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఏం జరిగిందో అర్థం చేసుకుంది. బాలిక గీసిన బొమ్మను బలమైన సాక్ష్యాధారంగా పరిగణించిన ఢిల్లీ కోర్టు నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బాలిక రక్షణణు శిశు సంక్షేమ ఫౌండేషన్ కు అప్పజెప్పి, 3 లక్షల పాప పేరిట డిపాజిట్ చేయమని నిందితుడిని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more